కాకరవాయి క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా ముగింపు
ఫస్ట్ ప్రైస్ మరిపెడ బంగ్లా..రెండవ విజేతగా కాకరవాయి
ఖమ్మం బ్యూరో, జనవరి 24(తెలంగాణ ముచ్చట్లు)
కాకరవాయి గ్రామంలో గ్రామీణ యువతకు క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందించడమే లక్ష్యంగా నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ ఉత్సాహభరితంగా, క్రీడాస్ఫూర్తితో ముగిసింది. వివిధ గ్రామాల నుంచి పాల్గొన్న జట్లు పోటీపడగా, చివరికి మరిపెడ బంగ్లా జట్టు అత్యుత్తమ ప్రదర్శనతో ఫస్ట్ ప్రైస్‌ను కైవసం చేసుకుంది. ఆతిథ్య జట్టుగా బరిలోకి దిగిన కాకరవాయి జట్టు రెండవ స్థానంలో నిలిచి ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది.
ఫైనల్ మ్యాచ్ చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగి, ఆటగాళ్ల చురుకుదనం, సమన్వయం, క్రీడాస్ఫూర్తి అందరి ప్రశంసలు పొందాయి. ప్రేక్షకుల చప్పట్ల మధ్య ఆటలు ఉత్కంఠగా కొనసాగాయి.విజేతలుగా నిలిచిన రెండు జట్లకు కాకరవాయి గ్రామ సర్పంచ్ గూడూరు ఉపేందర్, ఉప సర్పంచ్ కొత్తపల్లి వినోద, 2వార్డు సభ్యుడు నల్లగట్టు శ్రీనివాస్,3 వ వార్డ్ సభ్యులు షేక్ యాకుబ్ పాషా ముఖ్య అతిథులుగా హాజరై బహుమతులు అందజేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ గూడూరు ఉపేందర్ మాట్లాడుతూ..క్రీడలు యువతలో శారీరక దృఢత్వంతో పాటు స్నేహభావం, క్రమశిక్షణ, ఐక్యతను పెంపొందిస్తాయి. యువతను చెడు అలవాట్ల నుంచి దూరంగా ఉంచేందుకు క్రీడలు అత్యంత అవసరం అని తెలిపారు. గ్రామస్థాయిలో ఇలాంటి క్రీడా కార్యక్రమాలకు గ్రామపంచాయతీ ఎల్లప్పుడూ సహకరిస్తుందని ఆయన స్పష్టం చేశారు.ఉప సర్పంచ్ కొత్తపల్లి వినోద మాట్లాడుతూ..గ్రామీణ యువత ప్రతిభను వెలికి తీసేందుకు క్రీడా టోర్నమెంట్‌లు వేదికగా మారాలని, భవిష్యత్తులో మరిన్ని క్రీడా పోటీలు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు.అదే విధంగా వార్డు నెంబర్స్ నల్లగట్టు శ్రీనివాస్,షేక్ యాకుబ్ పాషా మాట్లాడుతూ..గ్రామాల్లో క్రీడా వాతావరణం పెరగడం వల్ల యువత ఆరోగ్యంగా, క్రమశిక్షణతో ఎదుగుతుంది. గ్రామీణ స్థాయిలో ప్రతిభ ఉన్న ఆటగాళ్లను ప్రోత్సహించేందుకు ఇలాంటి టోర్నమెంట్‌లు ఎంతో ఉపయోగపడతాయి.యువత క్రీడల్లో ముందుకు రావడానికి తాను ఎల్లప్పుడూ సహకరిస్తానని తెలిపారు.ఈ టోర్నమెంట్‌ను విజయవంతంగా నిర్వహించిన నిర్వాహకులను గ్రామస్తులు అభినందించగా, కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు, క్రీడాభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆటగాళ్ల పోరాటంతో, ప్రేక్షకుల ఉత్సాహంతో కాకరవాయి గ్రామం క్రీడోత్సవ వాతావరణాన్ని సంతరించుకుంది.ఇదే సందర్భంలో క్రీడా స్ఫూర్తిని అత్యుత్తమంగా నిలబెట్టినందుకు మంగలి బండ తండ గ్రామ జట్టుకు ప్రత్యేక బహుమతులు అందజేశారు. క్రీడల్లో గెలుపోటములు సమానమేనని, ఆటతీరుతో పాటు క్రీడాస్ఫూర్తి కూడా ముఖ్యమని అతిథులు అభినందించారు.ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం మేనేజ్మెంట్ సభ్యులు నల్లగట్టు నవీన్,ఉడుగుల మధు, దోసపాటి ఉపేందర్,నల్లగట్టు వేణు, నల్లగట్టు లింగయ్య, నల్లగట్టు రోహిత్ కుమార్, జిల్లా మనోజ్, ఉడుగుల నరేష్ తదితరులు పాల్గొన్నారు..


Comments