నీ ఇంటి స్థలం కోసమే నా పోరాటం.
*టిడబ్ల్యూజెఎఫ్ జిల్లా అధ్యక్షులు సంతోష్ చక్రవర్తి*
*ఇండ్ల జాగాల ఉద్యమం లో సంఘాలన్నీ కలిసి రావాలి*
*గణతంత్ర వేడుక దినోత్సవ సన్నాహక సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా అధ్యక్షుడు*
ఖమ్మం బ్యూరో, జనవరి 24 (తెలంగాణ ముచ్చట్లు)
జర్నలిస్టుల ఇంటి జాగా సాధించే వరకు తమ ఉద్యమం ఆగదని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టిడబ్ల్యూజేఎఫ్) ఖమ్మం జిల్లా అధ్యక్షులు సంతోష్ చక్రవర్తి స్పష్టం చేశారు. ఖమ్మం ప్రెస్ క్లబ్‌లో టిడబ్ల్యూజేఎఫ్ ప్రెస్ క్లబ్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ సన్నాహ సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ, జర్నలిస్టుల ఐక్యతతోనే హక్కుల సాధన సాధ్యమని అన్నారు. అవసరమైతే ఉద్యమాన్ని జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి విస్తరించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
జర్నలిస్టుల ఇంటి జాగాల విషయంలో గత ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరిని ఇకపై సహించేది లేదని ఆయన హెచ్చరించారు. జర్నలిస్టుల కుటుంబాలకు భద్రత, గౌరవం కల్పించే వరకు టిడబ్ల్యూజేఎఫ్ పోరాటం నిరంతరం కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఖమ్మం ప్రెస్ క్లబ్ నూతన కమిటీకి అదనపు సభ్యుల నియామకం చేపట్టారు.
అనంతరం ఖమ్మం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు అంతోటి శ్రీనివాస్ మాట్లాడుతూ, జనవరి 26 ఉదయం 7:45 గంటలకు ప్రెస్ క్లబ్‌లో నిర్వహించనున్న గణతంత్ర దినోత్సవ వేడుకలకు సభ్యులందరూ తప్పనిసరిగా హాజరుకావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో టీబీజేఏ జిల్లా అధ్యక్షులు వందనపు సామ్రాట్ గుప్తా, వీడియో గ్రాఫర్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు అమరబోయిన ఉపేందర్, జిల్లా కోశాధికారి అర్వపల్లి నాగేష్, జిల్లా కార్యదర్శి నానబాల రామకృష్ణ, సంయుక్త కార్యదర్శి కుంభం రవికుమార్, టీబీజేఏ జిల్లా కోశాధికారి శ్రీధర్‌తో పాటు పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.


Comments