విద్యార్థులు సైన్స్‌ను అందిపుచ్చుకుని కొత్త ఆలోచనలకు పదును పెట్టాలి

స్కూల్ ప్రిన్సిపాల్ లవ్లీ బెన్నీ

విద్యార్థులు సైన్స్‌ను అందిపుచ్చుకుని కొత్త ఆలోచనలకు పదును పెట్టాలి

వనపర్తి,జనవరి24(తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తి జిల్లా కేంద్రంలోని వల్లబ్ నగర్ గౌతమ్ మోడల్ హైస్కూల్లో శనివారం నిర్వహించిన వైజ్ఞానిక ప్రదర్శన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సుమారు 400 మంది విద్యార్థులు హాజరుకాగా, మొత్తం 174 వైజ్ఞానిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపాల్ లవ్లీ బెన్నీ మాట్లాడుతూ ..రోజురోజుకు సాంకేతిక రంగంలో వేగంగా మార్పులు జరుగుతున్నాయని, వాటికి అనుగుణంగా విద్యార్థులు సైన్స్‌ను అలవర్చుకుని కొత్త ఆలోచనలకు పదును పెట్టాలని సూచించారు.చిన్ననాటి నుంచే ఆలోచనా శక్తిని పెంపొందించుకుంటే సాంకేతిక రంగంలో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని తెలిపారు.సైన్స్ అంటేనే నిజమని, సైన్స్ ద్వారా ప్రపంచంలో ప్రకృతిలో దాగి ఉన్న సత్యాలను తెలుసుకోవచ్చని చెప్పారు.సైన్స్‌ను జీవితంలో భాగంగా చేసుకుంటే భవిష్యత్తులో ముందుకు సాగడం సులభమవుతుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో స్కూల్ కరస్పాండెంట్ బెన్నీ జోసెఫ్‌తో పాటు ఉపాధ్యాయులు పాల్గొని విద్యార్థులను ప్రోత్సహించారు. విద్యార్థులు రూపొందించిన వైజ్ఞానిక నమూనాలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .