విద్యుత్ ఉద్యోగుల సంక్షేమ సంఘం సభను విజయవంతం చేసిన సభ్యులకు కృతజ్ఞతలు తెలిపిన నాయకులు
వరంగల్,జనవరి 24 (తెలంగాణ ముచ్చట్లు):
గిరిజన ఐక్యతకు ప్రతీకగా, సంఘ గౌరవానికి మరో మైలురాయిగా హనుమకొండలో గిరిజన విద్యుత్ ఉద్యోగుల సంక్షేమ సంఘం కంపెనీ కార్యవర్గ నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించిన 2026 డైరీ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా, విజయవంతంగా నిర్వహించబడిన సందర్భంగా సంఘ నాయకులు, సభ్యులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమానికి అభూతపూర్వమైన స్పందన లభించడంతో పాటు, అధిక సంఖ్యలో హాజరైన గిరిజన జాతి సోదర–సోదరీమణులు సభ విజయానికి ప్రధాన బలంగా నిలిచారని సంఘ నాయకులు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరి హాజరు సంఘానికి అపారమైన ధైర్యాన్ని ఇచ్చిందని, సభ్యుల సహకారం, ఐక్యత సంఘ ప్రయాణానికి మార్గదర్శకంగా మారిందని తెలిపారు.
అలాగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో అహర్నిశలు అంకితభావంతో పనిచేసిన హనుమకొండ సర్కిల్ బాడీ, వరంగల్ సర్కిల్ బాడీ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. సమావేశపు హాల్ అలంకరణ, భోజన ఏర్పాట్లతో పాటు సమన్వయంతో పనిచేసి సంఘ ప్రతిష్ఠను మరింత పెంచడంలో వారు కీలక పాత్ర పోషించారని అన్నారు.
ఈ సందర్భంగా వాలు నాయక్, హర్జీ నాయక్, శ్రీరామ్ నాయక్ లు మాట్లాడుతూ, ఈ ఆత్మీయత, సంఘబలం ఎప్పటికీ ఇలాగే కొనసాగాలని ఆకాంక్షిస్తూ, భవిష్యత్తులోనూసంఘాన్ని మరింత బలోపేతం చేయడానికి అందరూ కలసి ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.


Comments