ఆకారపు అరుణ్ తండ్రి సత్యనారాయణ అంతిమయాత్రలో పాల్గొన్న కాంగ్రెస్ నేతలు
ఉప్పల్, జనవరి 24 (తెలంగాణ ముచ్చట్లు):
ఉప్పల్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆకారపు అరుణ్ కుమార్ తండ్రి సత్యనారాయణ అనారోగ్య కారణాలతో ఇటీవల మృతిచెందారు. ఈ నేపథ్యంలో నిర్వహించిన ఆయన అంతిమయాత్రలో కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొని మృతుడికి ఘన నివాళులు అర్పించారు ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మందముల పరమేశ్వర్ రెడ్డి మృతుడి పార్థివ దేహాన్ని సందర్శించి పుష్పగుచ్ఛాలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సత్యనారాయణ కుటుంబానికి ఆధారస్తంభంగా నిలిచారని, ఆయన మరణం కుటుంబానికి తీరని లోటని పేర్కొన్నారు. ఈ కఠిన సమయంలో ఆకారపు అరుణ్ కుమార్ కుటుంబానికి పార్టీ తరఫున పూర్తి మద్దతు ఉంటుందని భరోసా ఇచ్చారు.
అలాగే మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ పూర్ణ యాదవ్, వైస్ చైర్మన్ విఠల్ నాయక్, సీనియర్ యూత్ కాంగ్రెస్ నాయకులు టిల్లు యాదవ్ తదితరులు కూడా అంతిమయాత్రలో పాల్గొని మృతుడికి నివాళులర్పించారు. వారు ఆకారపు అరుణ్ కుమార్, ఆకారపు అనిల్ కుమార్ కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.అంతిమయాత్రసందర్భంగా పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు, స్థానిక ప్రజలు హాజరై సత్యనారాయణకు కన్నీటి వీడ్కోలు పలికారు. కుటుంబ సభ్యులు ఆయన సేవలు, జీవన ప్రయాణాన్ని స్మరించుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు.


Comments