వెల్టూర్ మన చర్చ్ లో ఘనంగా గణతంత్ర వేడుకలు

వెల్టూర్ మన చర్చ్ లో ఘనంగా గణతంత్ర వేడుకలు

పెద్దమందడి,జనవరి26(తెలంగాణ ముచ్చట్లు):

పెద్దమందడి మండలం వెల్టూర్ న్యూ ఎస్సీ కాలనీలోని మనచర్చి వద్ద సోమవారం ఉదయం 77వ గణతంత్ర దినోత్సవాన్ని ఆనందోత్సవాల మధ్య ఘనంగా నిర్వహించారు.చర్చి పాస్టర్ సురేష్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జెండావందన పండగను భక్తి, దేశభక్తి భావాలతో జరుపుకున్నారు.
ఈ సందర్భంగా జాతీయ జెండాకు ఘనంగా వందనం అర్పించి, భారతదేశ ఐక్యత, సమగ్రత, శాంతి, సౌభ్రాతృత్వ విలువలను గుర్తు చేసుకున్నారు. దేశ అభివృద్ధికి ప్రతి పౌరుడు తన వంతు బాధ్యత నిర్వర్తించాలని పాస్టర్ సురేష్ కుమార్ పిలుపునిచ్చారు. గణతంత్ర దినోత్సవ ప్రాముఖ్యతను వివరించడంతో పాటు దేశానికి సేవ చేయడమే నిజమైన దేశభక్తి అని సందేశమిచ్చారు.ఈ కార్యక్రమంలో మన చర్చి సభ్యులు, కాలనీ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .