ఈస్ట్ గాంధీనగర్ నూతన అధ్యక్షులు జి. సత్యం సాగర్‌కు శాలువాతో సన్మానం
నాగారం సగర సంగం సభ్యులు
నాగారం, జనవరి 24 (తెలంగాణ ముచ్చట్లు):
మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా ఘట్కేసర్ సర్కిల్ పరిధిలోని నాగారం డివిజన్ ఈస్ట్ గాంధీనగర్ నూతన అధ్యక్షులుగా జి. సత్యం సాగర్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నాగారం సగర సంఘం ఆధ్వర్యంలో ఆయనకు శాలువాతో ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న సంఘ నాయకులు మాట్లాడుతూ, జి. సత్యం సాగర్ సేవాభావం, సమాజ అభివృద్ధిపై ఉన్న చిత్తశుద్ధి దృష్ట్యా ఆయనను అధ్యక్షులుగా ఎన్నుకున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో ఈస్ట్ గాంధీనగర్ ప్రాంతంలో సగర సంఘాన్ని మరింత బలోపేతం చేసి, సామాజిక కార్యక్రమాలు, సంక్షేమ సేవలను విస్తృతంగా నిర్వహించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా సగర సంఘం జనరల్ సెక్రటరీ టి. నరసింహ సాగర్, నాగారం సగర సంఘం అధ్యక్షులు కేసాని రాజు సాగర్, జనరల్ సెక్రటరీ చెన్నయ్య సాగర్, కోశాధికారి వి. శేఖర్ సాగర్, ఉపాధ్యక్షులు ఎం. దేవేందర్ సాగర్, కేసాని రఘు సాగర్, టి రాము సాగర్ , జి . వెంకటసాగర్, టి శ్రీనివాస సాగర్, తదితర నాయకులు పాల్గొని నూతన అధ్యక్షుడికి శుభాకాంక్షలు తెలిపారు.నూతన అధ్యక్షులు జి. సత్యం సాగర్ మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచి బాధ్యత అప్పగించిన కాలనీ సగర సంగం సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. సంఘ అభివృద్ధి, సభ్యుల సంక్షేమం, యువత భాగస్వామ్యంతో ముందుకు సాగేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమం ఆత్మీయ వాతావరణంలో విజయవంతంగా ముగిసింది.


Comments