యువతలో జాతీయ స్పూర్తి నింపిన గణతంత్ర దినోత్సవం
పెద్దమందడి,జనవరి26(తెలంగాణ ముచ్చట్లు):
గణతంత్ర దినోత్సవ శుభ సందర్భంగా పెద్దమందడి మండలం మద్దిగట్ల జడ్పీ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో దేశభక్తి వాతావరణంలో కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేశభక్తికి ప్రతీక అయిన మహానేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని స్మరించుకుంటూ యువతలో జాతీయ చైతన్యాన్ని పెంపొందించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు.స్వామి వివేకానంద యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన వ్యాస రచన పోటీల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ఘనంగా బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా మద్దిగట్ల గ్రామ సర్పంచ్ రాములు యాదవ్ మాట్లాడుతూ.. విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహించాలనే సేవాభావంతో ఈ కార్యక్రమానికి అవసరమైన బహుమతులను జె. మల్లేష్, జె. తిరుపతయ్య కుమారుడు, ఉదారంగా సమకూర్చారు.విద్యార్థుల్లో ఆలోచనల్లో అగ్ని, హృదయాల్లో దేశభక్తి, లక్ష్యాల్లో నాయకత్వం అనే స్ఫూర్తిని నింపే విధంగా ఈ కార్యక్రమం సాగిందని మద్దిగట్ల గ్రామ సర్పంచ్ రాములు యాదవ్ తెలిపారు.ఇలాంటి కార్యక్రమాలు యువతను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు.


Comments