ఆటో యూనియన్ సంఘానికి అండగా నిలుస్తా
ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి
వనపర్తి,జనవరి25(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి పట్టణంలోని రాజీవ్ ఆటో యూనియన్ సంఘానికి ఎప్పుడూ అండగా ఉంటానని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి భరోసా కల్పించారు.ఆదివారం వనపర్తి పట్టణంలో ఉన్న ఎమ్మెల్యే నివాస కార్యాలయంలో ఆటో యూనియన్ నాయకులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సంఘ అధ్యక్షులు, కార్యదర్శులను ఎమ్మెల్యే శాలువాలతో సత్కరించారు.ఆటో యూనియన్ సంఘ భవన నిర్మాణానికి సంబంధించి స్థలం కేటాయింపు, భవన నిర్మాణం తదితర అంశాల్లో పూర్తిస్థాయిలో సహకరిస్తానని ఎమ్మెల్యే మేఘారెడ్డి తెలిపారు. ఆటో కార్మికుల సంక్షేమానికి తన వంతు కృషి ఎప్పటికీ కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ గౌరవాధ్యక్షులు, వనపర్తి వ్యవసాయ మార్కెట్ యార్డ్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, జిల్లా యూత్ అధ్యక్షులు వాకిటి ఆదిత్య, సంఘం అధ్యక్షులు ఎం.డి. హుస్సేన్, ఉపాధ్యక్షులు తిరుపతి, రసూల్, దుర్గేష్, కోశాధికారి శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి పరమేష్‌తో పాటు సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


Comments