వనపర్తి పట్టణంలో హైమాస్ట్ లైట్లు ప్రారంభించిన ఎమ్మెల్యే మేఘారెడ్డి
వనపర్తిజనవరి24(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి పట్టణంలోని మారెమ్మకుంట కూడలి, గాంధీచౌక్ ఉర్దూ మీడియం పాఠశాల కూడలిలో రూ.4 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్లను శనివారం వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..పట్టణంలోని ప్రజలకు భద్రతతో పాటు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. హైమాస్ట్ లైట్ల ఏర్పాటుతో రాత్రి వేళల్లో వెలుతురు సమస్య పూర్తిగా తొలగిపోతుందని పేర్కొన్నారు.ఈ లైట్ల ఏర్పాటు వల్ల దీర్ఘకాలంగా ఉన్న సమస్య తీరిపోయిందని కాలనీవాసులు హర్షం వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్లుగా అధికారులు,ప్రజాప్రతినిధులను కోరినా సమస్య పరిష్కారం కాలేదని, నేడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ప్రత్యేక చొరవతో హైమాస్ట్ లైట్లు ఏర్పాటు కావడం అభినందనీయమని అన్నారు.ఈ కార్యక్రమంలో వనపర్తి పట్టణ మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


Comments