గార్లపాడు గ్రామ జాతీయ జెండా ఆవిష్కరించిన డిఐజి శ్రీనివాస్ రెడ్డి
జోగులాంబ గద్వాల జిల్లా తెలంగాణ ముచ్చట్లు
రాజోలిమండల కేంద్రంలో ఉన్నటువంటి పరిమటి గార్లపాడు గ్రామం 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమాన్ని సర్పంచ్ శారదమ్మ ఉప సుజాత ధనుంజయ నాయకుడు రత్నపానంగారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించగా ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు.ఈ సందర్భంగా ఐజి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, భారత రాజ్యాంగం ప్రతి పౌరునికి సమాన హక్కులు కల్పించిందని, వాటిని పరిరక్షించుకోవడం ప్రతి భారతీయుడి బాధ్యత అని అన్నారు. దేశ స్వాతంత్ర్యం, సమగ్రత, ఐక్యత కోసం మహనీయులు చేసిన త్యాగాలు తరతరాలకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. యువత దేశాభివృద్ధిలో చురుకైన పాత్ర పోషించాలని ఆయన పిలుపునిచ్చారు.అలాగే గార్లపాడు గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎప్పుడూ ముందుండి పనిచేస్తానన డిఐజి శ్రీనివాస్ స్పష్టం చేశారు. ప్రజలతో నేరుగా మమేకమై వారి సమస్యలను తెలుసుకుంటూ సేవా కార్యక్రమాలు నిర్వహించడమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు సర్పంచ్ శారద ఉప సర్పంచ్ సుజాత ధనుంజయ నాగరాజు రంగన్న కార్యకర్తల పాల్గొన్నారు


Comments