‘నా దేశం – నా బాధ్యత’ నినాదంతో గణతంత్ర వేడుకలు

‘నా దేశం – నా బాధ్యత’ నినాదంతో గణతంత్ర వేడుకలు

ఎల్కతుర్తి, జనవరి 26: (తెలంగాణ ముచ్చట్లు) 

ఎల్కతుర్తి మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు మంతుర్తి శ్రీకాంత్ యాదవ్ జాతీయ జెండాను ఆవిష్కరించి గణతంత్ర దినోత్సవ వేడుకలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గణతంత్ర దినోత్సవం భారత రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్య స్ఫూర్తిని గుర్తుచేసే మహత్తర దినమని పేర్కొన్నారు. దేశ ప్రజలకు స్వేచ్ఛ, సమాన హక్కులు కల్పించడంలో భారత రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్ అంబేద్కర్ చేసిన సేవలు మరువలేనివని అన్నారు.
కుల, మతాలకు అతీతంగా ‘నా దేశం – నా బాధ్యత’ అన్న భావనతో ప్రతి ఒక్కరూ దేశ అభివృద్ధికి తమ వంతు బాధ్యత నిర్వర్తించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఓబీసీ మోర్చా కార్యదర్శి ఏర్రగొల్లా శ్రీనివాస్ యాదవ్, మండల సీనియర్ నాయకులు, వివిధ మోర్చాల అధ్యక్షులు, మండల ఉపాధ్యక్షులు, బీజేవైఎం నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .