బండబావి ప్రాంతాన్ని మల్టీస్పోర్ట్స్ కాంప్లెక్స్ చివరి దశ డిజైన్ పరిశీలన
_జిహెచ్ఎంసి ఉప్పల్ జోనల్ కమిషనర్ రాధికగుప్తా ,కార్పొరేటర్ ప్రభుదాస్
నాచారం , జనవరి 16 (తెలంగాణ ముచ్చట్లు):
ఉప్పల్ నియోజకవర్గ మీర్పేట్ హెచ్ బీ కాలనీ డివిజన్ పరిధిలోని బండబావి ప్రాంతాన్ని జిహెచ్ఎంసి ఉప్పల్ జోనల్ కమిషనర్ రాధిక గుప్తా సందర్శించి, అక్కడ నిర్మించబోయే మల్టీస్పోర్ట్స్ కాంప్లెక్స్ చివరి దశ డిజైన్‌ను కార్పొరేటర్ జెరిపోతుల ప్రభుదాస్‌తో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా కార్పొరేటర్ ప్రభుదాస్ మాట్లాడుతూ, బండబావి ప్రాంతంలో మల్టీస్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణానికి రెండు దశలుగా ప్రతిపాదనలు రూపొందించామని తెలిపారు. మొదటి దశ పనులకు ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, అప్పటి జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్ చొరవతో అనుమతులు లభించాయని చెప్పారు. రెండవ దశ అనుమతుల కోసం జీహెచ్ఎంసీ స్టాండింగ్ కౌన్సిల్‌కు ప్రతిపాదన పంపించాలని కోరిన నేపథ్యంలో, ఉప్పల్ జోనల్ కమిషనర్ రాధిక గుప్తా బండబావి ప్రాంతాన్ని సందర్శించి డిజైన్‌ను పరిశీలించారని వివరించారు.డిజైన్‌ను పరిశీలించిన అనంతరం జోనల్ కమిషనర్ రాధిక గుప్తా త్వరలోనే మల్టీస్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణ పనులు ప్రారంభించేలా అవసరమైన చర్యలు తీసుకుంటామని సానుకూలంగా స్పందించినట్లు కార్పొరేటర్ తెలిపారు.బండబావి ప్రాంత అభివృద్ధికి ఎంతో కీలకమైన ఈ ప్రాజెక్టు కోసం కృషి చేస్తున్న జీహెచ్ఎంసీ కమిషనర్, ఆర్ వి కర్ణన్ ,ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, ఉప్పల్ జోనల్ కమిషనర్ రాధిక గుప్తాకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. ప్రణాళిక ప్రకారం పనులు త్వరగా ప్రారంభమయ్యేలా సహకరించాలని వారిని కోరారు.ఈ కార్యక్రమంలో నాచారం డిప్యూటీ కమిషనర్ నిత్యానందం, సూపరింటెండెంట్ ఇంజనీర్ హరికిషోర్, డీఈ ఉమా మహేశ్వరి, వర్క్ ఇన్‌స్పెక్టర్ చారి, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.


Comments