వెల్టూర్ అభివృద్ధిపై ఎమ్మెల్యే మేఘా రెడ్డికి కాంగ్రెస్ నాయకుల వినతి పత్రం

వెల్టూర్ గ్రామ అభివృద్ధికి ఎమ్మెల్యే మేఘారెడ్డి హామీ

వెల్టూర్ అభివృద్ధిపై ఎమ్మెల్యే మేఘా రెడ్డికి కాంగ్రెస్ నాయకుల వినతి పత్రం

-- వెల్టూర్ కంటెస్టెడ్ సర్పంచ్ అభ్యర్థి వడ్డే శేఖర్ 

వనపర్తి,జనవరి16 (తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తి ఎమ్మెల్యే మేఘా రెడ్డిని వెల్టూర్ గ్రామ కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. వెల్టూర్ కంటెస్టెడ్ సర్పంచ్ అభ్యర్థి వడ్డె శేఖర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు గురువారం ఎమ్మెల్యేను కలిసి వెల్టూర్ గ్రామ అభివృద్ధికి సంబంధించిన పలు సమస్యలను కూడిన వినతి పత్రాన్ని అందించారు.ఈ సందర్భంగా వెల్టూర్ గ్రామానికి సంబంధించిన పలు అభివృద్ధి అంశాలపై ఎమ్మెల్యేతో విస్తృతంగా చర్చించినట్లు వడ్డె శేఖర్ తెలిపారు. ముఖ్యంగా జాతీయ రహదారిపై వెల్టూర్ సమీపంలో ఎక్స్‌ప్రెస్ బస్ స్టాప్ ఏర్పాటు, గ్రామంలో బ్యాంకు స్థాపన, వారాంతపు సంత నిర్వహణకు అవసరమైన భూమి కేటాయింపు అంశాలను వినతి పత్రం ద్వారా ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు.
అదేవిధంగా త్వరలో జరగనున్న జిల్లాల పునర్విభజన నేపథ్యంలో వెల్టూర్ గ్రామాన్ని మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలనే అంశాన్ని క్యాబినెట్‌లో చర్చించేలా చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు. గ్రామంలోని హైస్కూల్ ప్రహరీ గోడ నిర్మాణానికి సంబంధించిన ప్రొసీడింగ్స్‌తో పాటు, కొన్ని కులాలకు సంబంధించిన కమ్యూనిటీ భవనాల నిర్మాణ అంశాలపై కూడా వినతి పత్రంలో పేర్కొన్నట్లు తెలిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేఘా రెడ్డి మాట్లాడుతూ.. వెల్టూర్ గ్రామ అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తామని, త్వరలోనే సంబంధిత అధికారులతో చర్చించి గ్రామానికి సంబంధించిన సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టి అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టి ప్రారంభోత్సవాలు నిర్వహిస్తామని హామీ ఇచ్చినట్లు వడ్డె శేఖర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో వెల్టూర్ కంటెస్టెడ్ సర్పంచ్ అభ్యర్థి వడ్డె శేఖర్, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రేమ్ సాగర్, మాజీ ఉపసర్పంచ్ మల్లికార్జున్, సీనియర్ నాయకులు రవీందర్, వివేక్, గుండెల ఆంజనేయులు, వినయ్, మద్దూర్ వెంకటయ్యతో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

మణిగిల్ల గ్రామంలో సంక్రాంతి సందర్భంగా ముగ్గుల, ఎడ్లబండి పోటీలు మణిగిల్ల గ్రామంలో సంక్రాంతి సందర్భంగా ముగ్గుల, ఎడ్లబండి పోటీలు
పెద్దమందడి,జనవరి16(తెలంగాణ ముచ్చట్లు): పెద్దమందడి మండలం మణిగిల్ల గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహించిన ముగ్గుల పోటీల్లో విజేతలకు బహుమతుల ప్రదాన కార్యక్రమం నిర్వహించారు. జూనియర్స్ విభాగంలో బోడి...
కూలి వెంకటయ్య అంత్యక్రియలకు ఆర్థిక సహాయం చేసిన బోధస్ లక్ష్మీనారాయణ
జనవరి 18న జరిగే బహిరంగ సభను జయప్రదం చేయండి
హక్కుల కోసం పోరాడేది కమ్యూనిస్టులే
బండబావి ప్రాంతాన్ని  మల్టీస్పోర్ట్స్ కాంప్లెక్స్ చివరి దశ డిజైన్ పరిశీలన
కుషాయిగూడ ఆర్టీసీ డిపోలో ‘అరైవ్ అలైవ్ క్యాంపైన్–2026’ అవగాహన సదస్సు
మద్దిగట్ల గ్రామంలో ముగ్గుల పోటీల విజేతలకు బహుమతుల ప్రదానం