జనవరి 18న జరిగే బహిరంగ సభను జయప్రదం చేయండి

_సిపిఐ మండల కార్యదర్శి దూసరి గోపాలరావు

జనవరి 18న జరిగే బహిరంగ సభను జయప్రదం చేయండి

ఖమ్మం బ్యూరో, జనవరి 16(తెలంగాణ ముచ్చట్లు)

వందేళ్ల నుధీర్ఘ పోరాటాన్ని నేటి తరానికి తెలియజేయడంతో పాటు భవిష్యత్తు పోరాటాలకు ప్రజలను సిద్దం చేసేందుకు 2026 జనవరి 18న ఖమ్మంలో చారిత్రక నభ నిర్వహిస్తున్నట్లు సిపిఐ చింతకాని మండల కార్యదర్శి దూసరి గోపాలరావు పేర్కొన్నారు. శుక్రవారం చింతకాని లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జనవరి 18న సాయంత్రం 3 గంటలకు డిగ్రీ కళాశాల మైదానంలో లక్షలాదిమందితో బహిరంగ నిర్వహిస్తున్నామని ఈ నభకు తెలంగాణ రాష్ట్రంతో పాటు దక్షిణాది రాష్ట్రాల నుంచి పెద్దసంఖ్యలో కార్యకర్తలు తరలిరానున్నారు. నలభై దేశాల నుండి ప్రతినిధులతో పాటు జాతీయ కార్యదర్శి రాజా, సిపిఐ జాతీయ నాయకత్వంతో పాటు అన్ని రాష్ట్రాల కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు, లక్షలాది మంది కార్యకర్తలు హాజరవుతున్నారన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా హాజరవుతన్నారని చింతకాని మండలం నుంచి పెద్ద ఎత్తున ప్రజలు బస్సులు, ఆటోలు, ట్రాక్టర్లు అందుబాటులో ఉన్న వాహనాలతో భారీగా తరలిరానున్నారన్నారు.. రైతులు, మహిళలు, యువత, శ్రామిక కార్మికులు అన్ని వర్గాలు దండులా తరలివచ్చి సభను జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో వాసు, కరీముల్లా, సాయి, సందీప్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

మణిగిల్ల గ్రామంలో సంక్రాంతి సందర్భంగా ముగ్గుల, ఎడ్లబండి పోటీలు మణిగిల్ల గ్రామంలో సంక్రాంతి సందర్భంగా ముగ్గుల, ఎడ్లబండి పోటీలు
పెద్దమందడి,జనవరి16(తెలంగాణ ముచ్చట్లు): పెద్దమందడి మండలం మణిగిల్ల గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహించిన ముగ్గుల పోటీల్లో విజేతలకు బహుమతుల ప్రదాన కార్యక్రమం నిర్వహించారు. జూనియర్స్ విభాగంలో బోడి...
కూలి వెంకటయ్య అంత్యక్రియలకు ఆర్థిక సహాయం చేసిన బోధస్ లక్ష్మీనారాయణ
జనవరి 18న జరిగే బహిరంగ సభను జయప్రదం చేయండి
హక్కుల కోసం పోరాడేది కమ్యూనిస్టులే
బండబావి ప్రాంతాన్ని  మల్టీస్పోర్ట్స్ కాంప్లెక్స్ చివరి దశ డిజైన్ పరిశీలన
కుషాయిగూడ ఆర్టీసీ డిపోలో ‘అరైవ్ అలైవ్ క్యాంపైన్–2026’ అవగాహన సదస్సు
మద్దిగట్ల గ్రామంలో ముగ్గుల పోటీల విజేతలకు బహుమతుల ప్రదానం