మణిగిల్ల గ్రామంలో సంక్రాంతి సందర్భంగా ముగ్గుల, ఎడ్లబండి పోటీలు
విజేతలకు బహుమతులు అందజేసిన సర్పంచ్ పలస శ్రీనివాస్ గౌడ్
పెద్దమందడి,జనవరి16(తెలంగాణ ముచ్చట్లు):
పెద్దమందడి మండలం మణిగిల్ల గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహించిన ముగ్గుల పోటీల్లో విజేతలకు బహుమతుల ప్రదాన కార్యక్రమం నిర్వహించారు. జూనియర్స్ విభాగంలో బోడి ప్రణవి (తండ్రి: బోడి గణేష్) మొదటి బహుమతి, వై లాస్య (తండ్రి: విష్ణువర్ధన్ రెడ్డి) రెండవ బహుమతి, గొంది లాస్య (తండ్రి: గొంది రాంరెడ్డి) మూడవ బహుమతి సాధించారు. పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కన్సొలేషన్ ప్రైజ్ అందజేశారు.సీనియర్స్ ముగ్గుల పోటీల్లో శైలజ (తండ్రి: నీలోజి) మొదటి బహుమతి, పి. ఝాన్సీ (తండ్రి: బీచుపల్లి) రెండవ బహుమతి, ఊదరి అక్షయ (తండ్రి: ఊదిరి రాములు) మూడవ బహుమతి పొందారు. ఈ విభాగంలో కూడా పాల్గొన్న ప్రతి ఒక్కరికి కన్సొలేషన్ ప్రైజ్ ఇచ్చారు.మకర సంక్రాంతి సందర్భంగా ఎడ్లబండి పోటీల అలంకరణ కార్యక్రమం నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ పోటీల్లో జాజలి రాములు మొదటి బహుమతి, బండపల్లి ఆంజనేయులు రెండవ బహుమతి, మండ్ల బాలయ్య మూడవ బహుమతి, మండ్ల బుచ్చన్న తదుపరి బహుమతి పొందారు. ఎడ్లబండి పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ కన్సొలేషన్ ప్రైజ్ అందజేశారు.గ్రామంలోని చెన్నకేశవ స్వామి ఆలయం వద్ద గ్రామ పెద్దల సమక్షంలో బహుమతుల ప్రదానం జరిగింది. కనుమ పండుగ సందర్భంగా బాల, బాలికలకు చెన్నకేశవ స్వామి ఆలయం వద్ద పతంగుల పోటీలు నిర్వహించినట్లు గ్రామ సర్పంచ్ పలుస శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు.


Comments