కుషాయిగూడలో గోదా రంగమన్నార్ కల్యాణోత్సవం
కుషాయిగూడ, జనవరి 14 (తెలంగాణ ముచ్చట్లు):
ఉప్పల్ నియోజకవర్గం కాప్రా సర్కిల్ కుషాయిగూడ శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ధనుర్మాస పూజా కార్యక్రమాల్లో భాగంగా బుధవారం శ్రీ గోదా రంగమన్నార్ కల్యాణోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ఉత్సవమూర్తులను ప్రతిష్టించి, అర్చకుల వేదమంత్రోచ్ఛారణల మధ్య కల్యాణ మహోత్సవం భక్తుల కనుల పండుగగా సాగింది.అర్చకులు రమణాచార్యులు, వేణుగోపాలాచార్యులు, నారాయణాచార్యులు, లక్ష్మణాచార్యులు వేద మంత్రాల ఉచ్చారణతో కల్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో కల్యాణాన్ని వీక్షించారు. అనంతరం భక్తులకు అన్న ప్రసాదాన్ని పంపిణీ చేశారు.ఈ కార్యక్రమాన్ని ఆలయ చైర్మన్ ఉప్పల యాదగిరి రెడ్డి ఆధ్వర్యంలో, దేవాదాయ ధర్మాదాయ శాఖ ఈవో మటమ్ వీరేశం పర్యవేక్షణలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమం లో ఆలయ వ్యవస్థాపక కుటుంబ సభ్యుడు పల్లె శ్రీకాంత్ రెడ్డి, ఆలయ సిబ్బంది రామ్ నరేష్, మహేందర్, శ్రీనివాస్ పాల్గొన్నారు.అలాగే సప్పిడి శ్రీనివాస్ రెడ్డి, పంజలా శ్రీనివాస్ గౌడ్, లక్ష్మీనారాయణ, భాష్య నాయక్, శ్రీకాంత్ రెడ్డి, సిద్దిపేట శ్రీనివాస్, మురళి పంతులు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.


Comments