సంక్రాంతి శోభను చాటిన మణిగిల్ల గ్రామ ముగ్గుల పోటీలు
పెద్దమందడి,జనవరి14(తెలంగాణ ముచ్చట్లు):
పెద్దమందడి మండలం మణిగిల్ల గ్రామంలో భోగి పండుగ శుభ సందర్భంగా గ్రామ నూతన సర్పంచ్ పలుస శ్రీనివాస్ గౌడ్, గ్రామ పెద్ద అనిల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలు ఘనంగా నిర్వహించారు. ఈ పోటీల్లో జూనియర్స్, సీనియర్స్ విభాగాల్లో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ఉత్సాహంగా రంగురంగుల ముగ్గులు వేశారు.తరతరాలుగా వస్తున్న సంక్రాంతి సంప్రదాయాన్ని కళ్లకు కట్టినట్లు ముగ్గులు వేయడంతో గ్రామం పండుగ వాతావరణంతో కళకళలాడింది. జూనియర్స్ విభాగం ముగ్గుల పోటీలు గ్రామంలోని శివాలయం వద్ద, సీనియర్స్ విభాగం పోటీలు స్వామి వివేకానంద స్టార్చ్ సమీపంలో నిర్వహించారు.ముగ్గుల పోటీల్లో జూనియర్స్, సీనియర్స్ విభాగాల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను రేపు మకర సంక్రాంతి రోజున చెన్నకేశవ స్వామి దేవాలయం వద్ద అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ నూతన సర్పంచ్ పలుస శ్రీనివాస్ గౌడ్‌తో పాటు గ్రామ ఉపసర్పంచ్ ముప్పూరి గణేష్ కుమార్, అనిల్ కుమార్ రెడ్డి, ఎస్. రాములు, పోతుల రామ్ రెడ్డి, పోతుల ప్రతాప్ రెడ్డి, రామకృష్ణారెడ్డి, రామిరెడ్డి రాజు, గొంది రామకృష్ణారెడ్డి, పలుస శేఖర్ గౌడ్, పలుస సంఘమేశ్వర్ గౌడ్, సుంచర్ మోని వెంకటయ్య, మండల దశరథం, బోయిని కృష్ణయ్య, ఆనంద్ కుమార్ రెడ్డి, కావలి శివశంకర్, ప్రేమ్ కుమార్ రెడ్డి, ఉప్పరి రాఘవేంద్ర, సింగం వెంకటయ్య, బోయిని గణేష్, సుంచర్ మోని అశోక్, గొల్ల మల్లి తదితరులు పాల్గొన్నారు.గ్రామ మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ముగ్గుల పోటీలను విజయవంతం చేయగా, ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన గ్రామ నూతన సర్పంచ్ పలుస శ్రీనివాస్ గౌడ్‌కు మరియు గ్రామ పెద్ద అనిల్ కుమార్ రెడ్డికి గ్రామ పెద్దలు, యువత అభినందనలు తెలియజేశారు.


Comments