కూలి వెంకటయ్య అంత్యక్రియలకు ఆర్థిక సహాయం చేసిన బోధస్ లక్ష్మీనారాయణ
కుషాయిగూడ, జనవరి 16 (తెలంగాణ ముచ్చట్లు):
ఉప్పల్ నియోజకవర్గం మీర్పేట్ హెచ్‌బీ కాలనీ డివిజన్ పరిధిలోని నెహ్రు నగర్ బ్లాక్ నెంబర్–2లో నివాసం ఉంటూ కూలి పనితో జీవనం కొనసాగిస్తున్న వెంకటయ్య (కూలి) గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ, ఆకస్మికంగా మృతి చెందాడు. వెంకటయ్య మరణవార్త తెలుసుకున్న టీఆర్‌ఎస్ మీర్పేట్ హెచ్‌బీ కాలనీ డివిజన్ సీనియర్ నాయకులు బోధస్ లక్ష్మీనారాయణ మృతదేహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా వెంకటయ్య అంత్యక్రియల కోసం ఆయన కుటుంబానికి రూ.5,000 ఆర్థిక సహాయాన్ని అందజేసి తన మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు. నిరుపేద కుటుంబానికి అండగా నిలిచిన బోధస్ లక్ష్మీనారాయణకు కాలనీవాసులు కృతజ్ఞతలు తెలిపారు.వెంకటయ్య కుటుంబం తీవ్రమైన పేదరికంలో జీవిస్తోందని, జీవనోపాధి కోసం సొంత గ్రామాన్ని విడిచి నెహ్రు నగర్‌కు వచ్చి కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోందని స్థానికులు తెలిపారు. వెంకటయ్య అనారోగ్యం కారణంగా కుటుంబం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోందని పేర్కొన్నారు.ఈ సందర్భంగా బోధస్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, వెంకటయ్య కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. అలాగే వెంకటయ్య మృతికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ, ఎవరైనా అనాధలు, నిరుపేదలు సహాయం కోరితే తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు.


Comments