హక్కుల కోసం పోరాడేది కమ్యూనిస్టులే

ఆటో ర్యాలీని ప్రారంభించిన సిపిఐ నేత ప్రకాష్బాబు

హక్కుల కోసం పోరాడేది కమ్యూనిస్టులే

ఖమ్మం బ్యూరో, జనవరి 16(తెలంగాణ ముచ్చట్లు)

కార్మిక హక్కులు, సంక్షేమం కోసం పోరాడేది కమ్యూనిస్టులేనని సిపిఐ జాతీయ కార్యదర్శి ప్రకాష్బాబు తెలిపారు. శుక్రవారం శ్రీశ్రీ సెంటర్లో శతాబ్ది ఉత్సవాల ముగింపు బహిరంగ సభ ప్రచారంలో భాగంగా ఆటో ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రకాష్బాబు మాట్లాడుతూ అసంఘటిత కార్మికుల శ్రమకు తగిన వేతనం లభించడం లేదన్నారు. శ్రమకు తగినవిధంగా వేతనం లభించే చర్యలు తీసుకోవడంలో పాలకులు విఫలమయ్యారని ప్రకాష్బాబు ఆరోపించారు. మోడీ తెచ్చిన లేబర్ కోడ్లు కార్మికుల హక్కులు హరించబడుతున్నాయని భవిష్యత్తులో కార్మిక వర్గం మరిన్ని క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొవాల్సి వస్తుందని యావత్ కార్మిక లోకం భవిష్యత్తు పోరాటాలకు సంసిద్దులు కావాలన్నారు. ఆటో ర్యాలీ శ్రీశ్రీ విగ్రహం వద్ద ప్రారంభమై నగరంలోని అన్ని ప్రధాన వీధుల్లో సాగింది. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి జమ్ముల జితేందర్రెడ్డి, నగర కార్యదర్శి ఎస్ కె జానిమియా, ఏఐటియుసి జిల్లా కార్యదర్శి టి. రామాంజనేయులు, హవేలి ఏరియా సిపిఐ కార్యదర్శి ఏనుగు గాంధీ, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి నానబాల రామకృష్ణ, ఆటో వర్కర్స్ యూనియన్ నాయకులు పి. మోహన్రావు, శ్రీనివాసరావు, జాకీర్, ఆముదాల వెంకన్న, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

మణిగిల్ల గ్రామంలో సంక్రాంతి సందర్భంగా ముగ్గుల, ఎడ్లబండి పోటీలు మణిగిల్ల గ్రామంలో సంక్రాంతి సందర్భంగా ముగ్గుల, ఎడ్లబండి పోటీలు
పెద్దమందడి,జనవరి16(తెలంగాణ ముచ్చట్లు): పెద్దమందడి మండలం మణిగిల్ల గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహించిన ముగ్గుల పోటీల్లో విజేతలకు బహుమతుల ప్రదాన కార్యక్రమం నిర్వహించారు. జూనియర్స్ విభాగంలో బోడి...
కూలి వెంకటయ్య అంత్యక్రియలకు ఆర్థిక సహాయం చేసిన బోధస్ లక్ష్మీనారాయణ
జనవరి 18న జరిగే బహిరంగ సభను జయప్రదం చేయండి
హక్కుల కోసం పోరాడేది కమ్యూనిస్టులే
బండబావి ప్రాంతాన్ని  మల్టీస్పోర్ట్స్ కాంప్లెక్స్ చివరి దశ డిజైన్ పరిశీలన
కుషాయిగూడ ఆర్టీసీ డిపోలో ‘అరైవ్ అలైవ్ క్యాంపైన్–2026’ అవగాహన సదస్సు
మద్దిగట్ల గ్రామంలో ముగ్గుల పోటీల విజేతలకు బహుమతుల ప్రదానం