మున్సిపల్ ఎన్నికలకు తెలుగుదేశంపార్టీ అధిష్టానం ఆదేశాలతో సిద్ధమవుతుంది
ఖమ్మం బ్యూరో, జనవరి 25(తెలంగాణ ముచ్చట్లు)
తెలుగుదేశం పార్టీ ఖమ్మం కార్యాలయంలో జరిగిన పత్రికా విలేఖరుల సమావేశం లో సోమవారం జరగబోయే రాష్ట్ర పార్టీ ఆదేశాలతో మున్సిపల్ ఎన్నికలలో తెలుగుదేశంపార్టీ పోటీ చేస్తుందని, ఆ పార్టీ జిల్లా నాయకులు తెలియచేసారు. ఖమ్మం పార్లమెంట్ పరిధిలోని అన్ని మున్సిపాలిటీలలో పోటీకి నాయకులు సిద్దంగా వుండాలని పిలుపునిచ్చారు. తెలుగుదేశంపార్టీ జాతీయ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశం మేరకు పిలుపు రాగానే కలసి వచ్చే పార్టీలతో పోటీ చేయటానికి సిద్దమని వారన్నారు. ఒకటి రెండు రోజులలో అధికారిక ప్రకటన వస్తుందన్నారు. ఖమ్మం నగరంతో పాటు జిల్లాలోని పలు సమస్యలపై గత బిఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రేసు ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టటంలో తెలుగుదేశం పార్టీ అనేక పోరాటాలను చేసి ప్రభుత్వ మెడలను వంచి ప్రజా సమస్యల పరిష్కారం చేయటంలో తెలుగుదేశం పార్టీ ముందుంజలో వున్నదని వారు తెలియచేసారు. గతంలో ఉమ్మడి ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వున్న చంద్రబాబు నాయుడు గారు మొదలు పెట్టిన సీతారామ ప్రాజెక్టును గత ప్రభుత్వం ఇప్పటి అధికార పక్షం అటకెక్కించిన తీరును ఎండగట్టి చంద్రబాబు తయారు చేయించిన పాత డిపిఆర్ ప్రకారమే తెలుగుదేశం పార్టీ పోరాట ఫలితంగా సీతారామ ప్రాజెక్ట్ కి నిధులు మంజూరు చేసారని వారన్నారు. పాలేరు చెరువులో సీతారామ నీరు పారిస్తే ఉమ్మడి జిల్లా మొత్తం పారుతాయని కావున చంద్రబాబు నాయుడు తయారు చేసిన డిపిఆర్ ద్వారా నే ప్రాజెక్ట్ నిర్మాణం జరగాలన్నారు. కావున వచ్చే మున్సిపల్ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ కే ఓటు అడిగే హక్కు వుందని వారన్నారు. వచ్చే మున్సిపల్ ఎన్నికలలో మెజారిటీ స్థానాలను గెలుచుకుంటామని వారు ధీమా వ్యక్తం చేసారు. ఈ సమావేశం లో కొండబాల కరుణాకర్, లీగల్ సెల్ రాష్ట్ర నాయకులు మల్లెంపాటి అప్పారావు, టి ఎన్ టి యు సి రాష్ట్ర నాయకులు వాసిరెడ్డి భాస్కర్ రావు , నాగార్జున శ్రీనివాస్ , గడిపూడి వెంకటేశ్వరావు, బోయిన వెంకన్న, నల్లమోతు సత్యనారాయణ , పాలడుగు క్రిష్ణ ప్రసాద్ , చుండూరు రాజరాజేశ్వరి, బోడేపూడి రవికుమార్, కామినేని శ్రీనివాస్ రావు , చావా రఘు, మల్లెంపాటి లహరిన్, పరిటాల నాగార్జున, మద్దినేని శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు


Comments