కాజీపేట రైల్వే స్టేడియంలో మేడారం బస్ లు ప్రారంభం
కాజీపేట్ జనవరి 25 తెలంగాణ ముచ్చట్లు
ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజనుల జాతర అయినటువంటి మేడారం సమ్మక్క- సారలమ్మ జాతరకు వివిధ ప్రాంతాల నుండి కాజీపేట రైల్వే జంక్షన్ కు వచ్చే ప్రయాణికులతో పాటు కాజీపేట్ చుట్టుపక్కల గ్రామాల ప్రజల సౌకర్యార్థం టీజేఎస్ ఆర్టిసి వరంగల్ - 2 డిపో వారిచే కాజీపేట జంక్షన్ ముందు నున్న రైల్వే స్టేడియంలో ఆదివారం బస్ ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు. మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్లే ప్రయాణికుల కోసం బస్సులను ఆపరేట్ చేసే ఇటువంటి క్యాంపును డిపో మేనేజర్ ఎం రవిచంద్ర అధ్యక్షతన కాజీపేట సీఐ ఎం సుధాకర్ రెడ్డి, ఎస్సై నవీన్ కుమార్ కాజీపేట రైల్వే స్టేడియం ఇన్చార్జ్ ఎస్సీ రైల్వే జర్నల్ ఇన్స్టిట్యూట్ సెక్రటరీ దేవులపల్లి రాఘవేంద్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా డిపో మేనేజర్ రవిచందర్ మాట్లాడుతూ ఇట్టి అవకాశాన్ని కాజీపేట చుట్టుపక్కల గ్రామాల ప్రజలు లతోపాటు రైల్వే స్పెషల్ రైళ్లు వేసిన కారణంగా హనుమకొండ బస్టాండ్ వెళ్లకుండా రైలు ప్రయాణికులు కాజీపేట జంక్షన్ సమీపంలోని రైల్వే స్టేడియంలో బస్ ప్రాంగణం లో 24 గంటల ప్రయాణ సదుపాయాన్ని కల్పిస్తున్న మనీ ఆయన అన్నారు. బస్సు ప్రాంగణం ద్వారా సునాయాస ప్రయాణం చేసి మేడారం చేరుకోగలరని ఆయన కోరారు. కాజీపేట్ నుండి మేడారం వరకు ఫుల్ టికెట్ రూ 250 హాఫ్ టికెట్ రూ 150 మహిళలకు ఉచితంగా రవాణా ను నిర్ణయించడం జరిగిందని, మంచినీరు, మెడికల్ క్యాంపు , క్యూ లైన్, మూత్రశాలలను ఏర్పాటు చేసినట్లుగా ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రైల్వే జనరల్ ఇన్స్టిట్యూట్ ట్రెజరర్ జి రాజేశ్వరరావు కమిటీ సభ్యులు ధరావత్ రఘు తెలంగాణ రైల్వే జేఏసీ చైర్మన్ కోండ్ర నర్సింగరావు టి జి ఎస్ ఆర్టీసీ అసిస్టెంట్ మేనేజర్ భవాని టీజీ బైరి రవీందర్ క్యాంప్ ఇన్చార్జిలు సిబ్బంది పాల్గొన్నారు.


Comments