విద్యార్థులు లక్ష్యం కోసం శ్రేమించాలి
తల్లిదండ్రుల ఆశయాలు సాదించాలి
గొప్పవాడిగా ఎదుగుటకు నిరంతరం సాధన చేయాలి
పట్టుదలతో సాధన చేస్తే విజయం సాధ్యం
మీకోసం మీ లక్ష్యం కోసం నిరంతరం మార్పు చెందాలి
పరకాల,జనవరి24(తెలంగాణ ముచ్చట్లు):
పరకాల సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలలో అన్వేల్ డే కార్యక్రమం ప్రిన్సిపాల్ ఆర్ సమ్మయ్య అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకొని నిరంతరం శ్రమించాలని, పట్టుదలతో సాధన చేస్తే విజయం సాధ్యమని ఆయన పేర్కొన్నారు. తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చే విధంగా విద్యార్థులు తమ విద్యాభ్యాసాన్ని కొనసాగించాలని సూచించారు.
ఈ కార్యక్రమానికి పేరెంట్స్ కమిటీ చైర్మన్, ఎస్ ఎస్ ఎఫ్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్, టీఎంజేఎఫ్ రాష్ట్ర అధికార ప్రతినిధి, ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ పెండ్యాల సుమన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులు స్పష్టమైన లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని, ఆ లక్ష్య సాధనకు నిరంతర సాధన అవసరమని ఆయన అన్నారు. ఉన్నతమైన ఆలోచనా విధానమే ఉన్నత స్థాయికి తీసుకెళ్తుందని, గొప్ప లక్ష్యాలను ఏర్పరుచుకొని గొప్పగా ఎదగాలని పిలుపునిచ్చారు. పలు మోటివేషనల్ కథనాల ద్వారా విద్యార్థుల్లో మార్పు తీసుకొచ్చే దిశగా, మంచి భవిష్యత్తుకు అవసరమైన ప్రణాళికను వివరించారు.
విశిష్ట అతిథిగా పాల్గొన్న ఒగ్లపూర్ సర్పంచ్ కే శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం విద్యార్థుల కోసం అందిస్తున్న సౌకర్యాలను సమర్థంగా వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డేవిడ్, ప్రియదర్శిని, ఏ సమ్మయ్య, రాజు, చారి శంకర్, బాలకృష్ణతో పాటు ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.


Comments