బీసీ–ఎస్సీ–ఎస్టీ–మైనారిటీల ఐక్యతతో రాజ్యాధికారం సాధ్యం
వరంగల్ ఆవిర్భావ సభలో బానోత్ సునీల్ నాయక్ వ్యాఖ్యలు
వరంగల్,జనవరి 24(తెలంగాణ ముచ్చట్లు):
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలు అన్నీ ఐక్యంగా ముందుకు సాగితే రాబోయే రోజుల్లో రాజ్యాధికారం సాధించడం సాధ్యమని ఎల్‌హెచ్‌పీఎస్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ బానోత్ సునీల్ నాయక్ అన్నారు. వరంగల్‌లో నిర్వహించిన బీసీ–ఎస్సీ–ఎస్టీ జేఏసీ ఆవిర్భావ సభలో ఆయన మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, డాక్టర్ విశారదన్ నాయకత్వంలో ఏర్పడిన జేఏసీని రాష్ట్రవ్యాప్తంగా బలోపేతం చేయాలని, ప్రతి జిల్లాలో కమిటీలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. సామాజిక న్యాయం లక్ష్యంగా జేఏసీ పనిచేస్తుందని చెప్పారు.
2029లో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో జేఏసీ పోటీ చేయనున్నట్లు, అదే విధంగా పార్లమెంట్ ఎన్నికల్లో కూడా పోటీ చేస్తుందని వెల్లడించారు. బీసీ రిజర్వేషన్ సాధన కోసం ఎల్‌హెచ్‌పీఎస్ నంగరభేరి ఎప్పటికీ మద్దతుగా నిలుస్తుందని బానోత్ సునీల్ నాయక్ స్పష్టం చేశారు.


Comments