బాధిత కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

బాధిత కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

పెద్దమందరం,జనవరి25(తెలంగాణ ముచ్చట్లు):

పెద్దమందడి మండలం మణిగిళ్ల గ్రామంలో సీఎం రిలీఫ్ ఫండ్‌కు సంబంధించిన చెక్కులను బాధిత కుటుంబాలకు పంపిణీ చేశారు. మణిగిళ్ల కాంగ్రెస్ పార్టీ కంటెస్టడ్ సర్పంచ్ అభ్యర్థి శివ యాదవ్ నాయకుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామానికి చెందిన వడ్డే రమేష్ (తండ్రి: వడ్డే సత్తి), తెలుగు రంగమ్మ (భర్త: శర్మ), కావలి శివానిలకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు.బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, వనపర్తి నియోజకవర్గ ముద్దుబిడ్డ ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి సౌజన్యంతో ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించినట్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు.ఈ సందర్భంగా లబ్ధిదారులు ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, వార్డు సభ్యులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

మణిగిల్ల గ్రామ పాఠశాలలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు మణిగిల్ల గ్రామ పాఠశాలలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
పెద్దమందడి,జనవరి26(తెలంగాణ ముచ్చట్లు): పెద్దమందడి మండలం మణిగిల్ల గ్రామంలోని  పాఠశాల మరియు అంగన్‌వాడీ సెంటర్ల చిన్నపిల్లల స్కూల్‌లో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.గ్రామ నూతన సర్పంచ్...
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్‌కు ప్రతి భారతీయుడు కృతజ్ఞతలు తెలుపాలి
గార్లపాడు గ్రామ జాతీయ జెండా ఆవిష్కరించిన డిఐజి శ్రీనివాస్ రెడ్డి
"తెలంగాణ ముచ్చట్లు"దినపత్రిక క్యాలెండర్ ఆవిష్కరించిన   రాజోలి గ్రామ సర్పంచ్ చింపుల  గంగిరెడ్డి 
‘నా దేశం – నా బాధ్యత’ నినాదంతో గణతంత్ర వేడుకలు
యువతలో జాతీయ స్పూర్తి నింపిన గణతంత్ర దినోత్సవం
ఎల్కతుర్తి సీఐ కార్యాలయంలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు