మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు విద్యా సామగ్రి విరాళం
పెద్దమందడి,జనవరి25(తెలంగాణ ముచ్చట్లు):
పెద్దమందడి మండల కేంద్రంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని 8వ వార్డు మెంబర్ జంగం శివ రూ.5,000/-రూపాయల విలువైన విద్యా సామగ్రిని విరాళంగా అందజేశారు.ఈ విరాళంలో విద్యార్థులకు అవసరమైన ప్యాడ్లు, పలకలు, నోట్ బుక్స్, పెన్నులు, బలపాలు తదితర విద్యా సామగ్రి ఉన్నాయి.విద్యార్థుల చదువుకు ఉపయుక్తంగా ఉండే విధంగా ఈ సామగ్రిని అందించడం ఎంతో అభినందనీయమని గ్రామస్తులుతెలిపారు.గణతంత్రదినోత్సవాన్నిపురస్కరించుకుని రేపు ఉదయం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ప్రాంగణంలో ఈ విద్యా సామగ్రిని విద్యార్థులకు అధికారికంగా పంపిణీ చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.ఈ సందర్భంగా జంగం శివ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు నాణ్యమైన విద్య పొందాలంటే అవసరమైన మౌలిక వసతులు, విద్యా సామగ్రి అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా విద్యార్థుల సంక్షేమానికి తన వంతు సహకారం కొనసాగిస్తానని ఆయనఅన్నారు.ఈ కార్యక్రమానికి పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు, స్థానిక నాయకులు తదితరులు హాజరుకానున్నారు.


Comments