ఈస్ట్ గాంధీనగర్ నూతన అధ్యక్షుడిగా గౌరక్క సత్యం సాగర్ ప్రమాణ స్వీకారం

ఈస్ట్ గాంధీనగర్ నూతన అధ్యక్షుడిగా గౌరక్క సత్యం సాగర్ ప్రమాణ స్వీకారం

నాగారం, జనవరి 25 (తెలంగాణ ముచ్చట్లు):

మేడ్చల్ నియోజకవర్గం ఘట్కేసర్ సర్కిల్ నాగారం డివిజన్ పరిధిలోని ఈస్ట్ గాంధీనగర్ కాలనీలో నూతన అధ్యక్షుడిగా గౌరక్క సత్యం సాగర్ ఆదివారం ఉదయం ఘనంగా ప్రమాణ స్వీకారం చేశారు.ఈ సందర్భంగా ఉపాధ్యక్షులుగా కేఎల్ రంగారాయుడు, టి. లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శిగా ఎం. సాయి ప్రసాద్ రెడ్డి, కోశాధికారిగా ఎన్. నవీన్ కుమార్, కార్యదర్శులుగా ఏ. పుల్లారావు, ఎస్.కె. ఇస్మాయిల్ బాధ్యతలు స్వీకరించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఈస్ట్ గాంధీనగర్ కాలనీ మాజీ కౌన్సిలర్ మాదిరెడ్డి వెంకట్ రెడ్డి హాజరై నూతన అధ్యక్షుడికి శుభాకాంక్షలు తెలిపారు. కాలనీ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారానికి సమిష్టిగా కృషి చేయాలని ఆయన సూచించారు.ఈ సందర్భంగా గౌరక్క సత్యం సాగర్ మాట్లాడుతూ, కాలనీ వాసుల సహకారంతో మౌలిక సదుపాయాల అభివృద్ధి, పారిశుధ్యం, తాగునీరు, రహదారుల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తానని తెలిపారు. కాలనీ సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో కాలనీ పెద్దలు, యువత, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన అధ్యక్షుడికి అభినందనలు తెలిపారు.కాలనీ పెద్దలు కే. అంజిరెడ్డి, కే. బాల మల్లేష్, కే. కొండల్ రెడ్డి, ఎల్. లక్ష్మణ్, ఆర్. భూపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .