ఆర్టీఐ యాక్టివిటీస్ ఫోరం సహకారంతో మహిళా సంఘంలో మందలలిత చేరిక

ఆర్టీఐ యాక్టివిటీస్ ఫోరం సహకారంతో మహిళా సంఘంలో మందలలిత చేరిక

అడ్డాకల్,జనవరి24(తెలంగాణ ముచ్చట్లు):

ఆర్టీఐ యాక్టివిటీస్ ఫోరం మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షులు మంగరాయి వెంకటేష్ సహాయంతో బలీదుపల్లి గ్రామానికి చెందిన మందలలితను మహిళా సంఘంలో చేర్చారు. రెండు నెలల క్రితం ఆర్థిక సహాయం కోరుతూ మహబూబ్‌నగర్ ప్రజావాణిలో జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయగా, కలెక్టర్ విజయేంద్ర బోయి ఆదేశాల మేరకు మహిళా సంఘంలో చేర్చాలని సూచనలు జారీ అయ్యాయి.ఈ ఆదేశాల ప్రకారం అడ్డాకుల మండల ఏపీఎం మహేష్ సూచనతో శుక్రవారం వీఏఓ శ్రీధర్ బలీదుపల్లి గ్రామంలోని మందలలిత స్వగృహంలో నూతనంగా ఝాన్సీ లక్ష్మీబాయి మహిళా సంఘాన్ని ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా విలేజ్ బుక్ కీపర్ శ్రీధర్ మాట్లాడుతూ.. మహిళలు ఆర్థికంగా ఎదగడానికి మహిళా సంఘాలు ఎంతో అవసరమని తెలిపారు. ప్రతి మహిళ మహిళా సంఘంలో చేరి పొదుపు అలవాటు చేసుకోవాలని, ప్రభుత్వం మహిళల ఆర్థిక స్వావలంబన కోసం మహిళా సంఘాలను ఏర్పాటు చేసిందని వివరించారు. మహిళా సంఘాల ద్వారా ప్రభుత్వ ఆర్థిక సహాయం పొందుతూ కుటుంబ అవసరాలు, పిల్లల చదువుకు ఆర్థికంగా తోడ్పాటు పొందవచ్చని సూచించారు.ఈ కార్యక్రమంలో ఝాన్సీ లక్ష్మీబాయి మహిళా సంఘానికి అధ్యక్షురాలిగా మందలలిత, కార్యదర్శిగా సుజాతను సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.మహిళా సంఘాల ద్వారా మహిళలు స్వయం ఉపాధి సాధించి, ఆర్థికంగా బలోపేతం కావాలని పాల్గొన్న వారు ఆకాంక్షించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .