పెద్దమందడి ఎస్సై జలంధర్ రెడ్డిని కలిసిన వెల్టూర్ సర్పంచ్ అశోక్
పెద్దమందడి,జనవరి24(తెలంగాణ ముచ్చట్లు):
పెద్దమందడి మండలం వెల్టూర్ గ్రామ సర్పంచ్ అశోక్ నూతనంగా బాధ్యతలు స్వీకరించిన పెద్దమందడి ఎస్ఐ జలంధర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్ఐకి శుభాకాంక్షలు తెలియజేస్తూ, గ్రామంలోని శాంతిభద్రతల పరిరక్షణకు పోలీస్ శాఖతో పూర్తి సహకారం అందిస్తామని సర్పంచ్ తెలిపారు.
గ్రామంలో శాంతిభద్రతలను మరింత బలోపేతం చేయడంలో భాగంగా, వెల్టూర్ గ్రామంలో రెండు మూడు రోజుల్లో నూతనంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్లు సర్పంచ్ అశోక్ ఈ సందర్భంగా తెలిపారు. గ్రామంలోని ముఖ్య కూడళ్లతో పాటు అవసరమైన ప్రాంతాల్లో ఈ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. దీని ద్వారా నేరాల నివారణతో పాటు ప్రజల భద్రత మరింత మెరుగుపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.పోలీస్–గ్రామ పాలన మధ్య సమన్వయంతో పనిచేస్తేనే గ్రామంలో శాంతియుత వాతావరణం నెలకొల్పవచ్చని సర్పంచ్ పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఎస్ఐ జలంధర్ రెడ్డి మాట్లాడుతూ..గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు శాంతిభద్రతలకు ఎంతో ఉపయోగపడుతుందని, ప్రజల సహకారంతో మండల పరిధిలో శాంతిభద్రతలను మరింత పటిష్టం చేస్తామని తెలిపారు. పోలీస్ శాఖ ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అశోక్, మాజీ ఉపసర్పంచ్ నాగమణి నరేష్, వార్డు సభ్యులు జోగు వెంకటేష్, పట్నం సత్యన్న తదితరులు పాల్గొన్నారు.


Comments