మణిగిల్ల గ్రామ పాఠశాలలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

మణిగిల్ల గ్రామ పాఠశాలలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

పెద్దమందడి,జనవరి26(తెలంగాణ ముచ్చట్లు):

పెద్దమందడి మండలం మణిగిల్ల గ్రామంలోని  పాఠశాల మరియు అంగన్‌వాడీ సెంటర్ల చిన్నపిల్లల స్కూల్‌లో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.గ్రామ నూతన సర్పంచ్ పలుస శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ పలుస శ్రీనివాస్ గౌడ్ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.భారత రాజ్యాంగం 1950 జనవరి 26న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అధ్యక్షతన అమల్లోకి వచ్చిందని గుర్తుచేశారు.రాజ్యాంగం అమలుకు ముందు పేద, బడుగు బలహీన వర్గాలు, గిరిజనులు విద్యకు దూరంగా ఉండేవారని, రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత విద్య హక్కుగా మారి పేద విద్యార్థులకు ఉన్నత విద్యకు మార్గం సుగమమైందని తెలిపారు. విద్యార్థులు భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్‌ను ఆదర్శంగా తీసుకొని క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించాలని సూచించారు.అలాగే విద్యార్థుల కోసం త్వరలో ఉచిత ఆర్‌ఓ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. గ్రామ పాఠశాలలో పారిశుద్ధ్యం మెరుగుపరచడంతో పాటు మంచినీటి వసతులు కల్పిస్తామని తెలిపారు. పదో తరగతి పరీక్షల్లో 10/10 ఉత్తీర్ణత సాధించి మొదటి స్థానంలో నిలిచిన విద్యార్థులకు రూ.20,016 నగదు బహుమతి అందిస్తామని ప్రకటించారు.అదేవిధంగా పాఠశాలలో సొంత నిధులతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన వివిధ ఆటపోటీల్లో పాల్గొన్న విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ ముప్పూరి గణేష్ కుమార్, వార్డు మెంబర్లు శ్రీకాంత్ రెడ్డి, కావలి సరోజ, జాజలి గణేష్ కుమార్, అనురాధ, ఊదరి శాంతమ్మ, ఊదరి వెంకటయ్య, పి. జయమ్మతో పాటు గ్రామ పెద్దలు సుంచర మౌని రాములు, పోతుల రాంరెడ్డి, మధిరాల రాంరెడ్డి, గొంది రామకృష్ణారెడ్డి, ఎం.బుచ్చన్న, కొములయ్య, నరసింహారెడ్డి, చెన్నయ్య, రవి, సాయి కుమార్, ఉషన్న, కృష్ణయ్య, ఆనంద్ రెడ్డి, బాలరాజు, శివ శంకర్, రాఘవేంద్ర, మల్లికార్జున్, చందు, సాయి కుమార్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. అలాగే ప్రధానోపాధ్యాయులు, గ్రామ స్వచ్ఛంద కార్మికులు, శివ స్వాములు పాల్గొన్నారు.చివరగా గ్రామ నూతన సర్పంచ్ పలుస శ్రీనివాస్ గౌడ్ గ్రామ పెద్దలకు, యువతకు, విద్యార్థులకు 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

మణిగిల్ల గ్రామ పాఠశాలలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు మణిగిల్ల గ్రామ పాఠశాలలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
పెద్దమందడి,జనవరి26(తెలంగాణ ముచ్చట్లు): పెద్దమందడి మండలం మణిగిల్ల గ్రామంలోని  పాఠశాల మరియు అంగన్‌వాడీ సెంటర్ల చిన్నపిల్లల స్కూల్‌లో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.గ్రామ నూతన సర్పంచ్...
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్‌కు ప్రతి భారతీయుడు కృతజ్ఞతలు తెలుపాలి
గార్లపాడు గ్రామ జాతీయ జెండా ఆవిష్కరించిన డిఐజి శ్రీనివాస్ రెడ్డి
"తెలంగాణ ముచ్చట్లు"దినపత్రిక క్యాలెండర్ ఆవిష్కరించిన   రాజోలి గ్రామ సర్పంచ్ చింపుల  గంగిరెడ్డి 
‘నా దేశం – నా బాధ్యత’ నినాదంతో గణతంత్ర వేడుకలు
యువతలో జాతీయ స్పూర్తి నింపిన గణతంత్ర దినోత్సవం
ఎల్కతుర్తి సీఐ కార్యాలయంలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు