సత్తుపల్లి డిపోలో ఘనంగా డ్రైవర్స్ డే వేడుకలు.

సత్తుపల్లి, జనవరి 24 (తెలంగాణ ముచ్చట్లు):
డ్రైవర్స్ డే సందర్భంగా సత్తుపల్లి ఆర్టీసీ డిపోలో డిపో మేనేజర్ గురిజాల లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా వేడుకలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రైవర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తూ రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలని సూచించారు. ఏకాగ్రతతో వాహనం నడిపితే ప్రమాదాలను పూర్తిగా నివారించవచ్చని తెలిపారు. డ్రైవింగ్ సమయంలో సెల్‌ఫోన్ వినియోగించకూడదని, మద్యం సేవించి వాహనం నడపడం నేరమని డ్రైవర్లకు స్పష్టం చేశారు. ఉదయం 5 గంటల నుంచే సత్తుపల్లి డిపోలో ప్రతి డ్రైవర్‌కు గులాబీ పూలు అందజేసి డ్రైవర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. ప్రయాణికుల పట్ల మర్యాదగా ప్రవర్తిస్తూ సంస్థ ఆదాయం పెంపునకు కృషి చేయాలని కోరారు. రోడ్డు ప్రమాదాల నివారణలో డ్రైవర్ల పాత్ర అత్యంత కీలకమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ పి. ప్రవీణ్ కుమార్, అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీర్ ఎస్. సాహితి సహా ఆర్టీసీ ఉద్యోగులు పాల్గొన్నారు.


Comments