నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవం.
Views: 1
On
సత్తుపల్లి, జనవరి 26 (తెలంగాణ ముచ్చట్లు):
స్థానిక పట్టణంలో నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఏ.జి.ఎం. రామ్‌కీ మరియు ప్రిన్సిపల్ యనమల రామ్మూర్తి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం వారు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ గణతంత్ర దినోత్సవ ప్రాముఖ్యతను వివరించారు. భారత రాజ్యాంగంలోని విలువలు, దేశభక్తి, క్రమశిక్షణలను విద్యార్థులు తప్పనిసరిగా అలవర్చుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు దేశభక్తి గీతాలు, నృత్యాలు, ప్రసంగాలతో ఆకట్టుకున్నారు. చిన్నారులు స్వాతంత్ర్య సమరయోధులు, జాతీయ నాయకుల వేషధారణలో పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
అనంతరం ఉపాధ్యాయులు, సిబ్బంది విద్యార్థులకుగణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు
Tags:
Related Posts
Post Your Comments
Latest News
26 Jan 2026 21:52:07
పెద్దమందడి,జనవరి26(తెలంగాణ ముచ్చట్లు):
పెద్దమందడి మండలం మణిగిల్ల గ్రామంలోని పాఠశాల మరియు అంగన్‌వాడీ సెంటర్ల చిన్నపిల్లల స్కూల్‌లో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.గ్రామ నూతన సర్పంచ్...


Comments