ఎల్కతుర్తి సీఐ కార్యాలయంలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

ఎల్కతుర్తి సీఐ కార్యాలయంలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

ఎల్కతుర్తి. జనవరి 26: (తెలంగాణ ముచ్చట్లు) 

హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలోని సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ పులి రమేష్ జాతీయ జెండాను ఆవిష్కరించారు.
కార్యక్రమంలో సీఐ పులి రమేష్, ఎస్సై ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవం దేశ స్వాతంత్ర్యానికి, రాజ్యాంగ విలువలకు ప్రతీక అని అన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం ఎందరో మహానుభావులు చేసిన త్యాగాల వల్లే నేడు మనం స్వేచ్ఛగా జీవిస్తున్నామని పేర్కొన్నారు.
ఆ మహనీయుల ఆశయాలను కొనసాగించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని, ముఖ్యంగా పోలీస్ విభాగానికి ఇది మరింత కీలకమని తెలిపారు. పోలీస్ శాఖ కేవలం చట్ట అమలు మాత్రమే కాకుండా ప్రజల రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా పనిచేస్తుందని స్పష్టం చేశారు. న్యాయమే లక్ష్యంగా, సేవే స్వభావంగా ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందిస్తూ నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తించాలని పిలుపునిచ్చారు.
శాంతిభద్రతల పరిరక్షణలో రాత్రింబవళ్లు శ్రమిస్తున్న పోలీస్ సిబ్బందిని ఈ సందర్భంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, మీడియా మిత్రులు పాల్గొన్నారు. చివరగా పోలీస్ కుటుంబ సభ్యులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ
జైహింద్… జై భారత్ అని నినదించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

మణిగిల్ల గ్రామ పాఠశాలలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు మణిగిల్ల గ్రామ పాఠశాలలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
పెద్దమందడి,జనవరి26(తెలంగాణ ముచ్చట్లు): పెద్దమందడి మండలం మణిగిల్ల గ్రామంలోని  పాఠశాల మరియు అంగన్‌వాడీ సెంటర్ల చిన్నపిల్లల స్కూల్‌లో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.గ్రామ నూతన సర్పంచ్...
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్‌కు ప్రతి భారతీయుడు కృతజ్ఞతలు తెలుపాలి
గార్లపాడు గ్రామ జాతీయ జెండా ఆవిష్కరించిన డిఐజి శ్రీనివాస్ రెడ్డి
"తెలంగాణ ముచ్చట్లు"దినపత్రిక క్యాలెండర్ ఆవిష్కరించిన   రాజోలి గ్రామ సర్పంచ్ చింపుల  గంగిరెడ్డి 
‘నా దేశం – నా బాధ్యత’ నినాదంతో గణతంత్ర వేడుకలు
యువతలో జాతీయ స్పూర్తి నింపిన గణతంత్ర దినోత్సవం
ఎల్కతుర్తి సీఐ కార్యాలయంలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు