మంత్రి పొంగులేటిని కలిసిన సంఘాల నాయకులు

మంత్రి పొంగులేటిని కలిసిన సంఘాల నాయకులు

హైదరాబాద్,జనవరి24(తెలంగాణ ముచ్చట్లు):

దావోస్ పర్యటన ముగించుకుని స్వదేశానికి తిరిగివచ్చిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిను వివిధ సంఘాల నాయకులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. దావోస్‌లో తెలంగాణ మోడల్ దేశ సగటును మించిన పనితీరును నమోదు చేయడంపై వారు అభినందనలు వ్యక్తం చేశారు. 2024, 2025 దావోస్ ఎంవోయూల అమలులో తెలంగాణకు 60 శాతం స్ట్రైక్‌రేట్ సాధించగా, దేశ సగటు 35 శాతంగానే ఉండటం గమనార్హమని పేర్కొన్నారు.

‘తెలంగాణ రైజింగ్’ విజన్‌తో భారీ పెట్టుబడి ఒప్పందాలు కుదుర్చుకోవడం, భారత్ ఫ్యూచర్ సిటీతో పాటు తొలి నెట్-జీరో స్మార్ట్ సిటీపై గ్లోబల్ స్థాయిలో ఆసక్తి నెలకొనడం రాష్ట్రానికి దిశానిర్దేశకంగా నిలిచిందని అన్నారు. క్యూర్–ప్యూర్–రేర్ వ్యూహంతో 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యంగా రేవంత్ రెడ్డితో కలిసి అమెరికా పర్యటనను విజయవంతంగా పూర్తి చేసి తిరిగివచ్చిన సందర్భంగా మంత్రి పొంగులేటిని అభినందించారు.

ఈ కార్యక్రమంలో మార్వాడి గో బ్యాక్ జేఏసీ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి, మోత్కూర్ మాజీ మున్సిపల్ చైర్మన్ చాగంటి రాములు, ఓయూ జేఏసీ నాయకుడు గాదె వెంకట్, తెలంగాణ దళిత బహుజన సమితి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ బొమ్మెర స్టాలిన్, బీఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు బోరెల్లి సురేష్, మాదిగ జేఏసీ రాష్ట్ర కార్యదర్శి గుర్రం కోటేష్, ఎస్సీ ఎస్టీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మాడుగుల శివ, వడ్డేమాన్ రాజారాం ప్రకాష్, మద్దెల రాజు, పాలడుగు రమేష్, కాంగ్రెస్ నాయకుడు ఓరుగంటి శ్రీకాంత రజక తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

మణిగిల్ల గ్రామ పాఠశాలలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు మణిగిల్ల గ్రామ పాఠశాలలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
పెద్దమందడి,జనవరి26(తెలంగాణ ముచ్చట్లు): పెద్దమందడి మండలం మణిగిల్ల గ్రామంలోని  పాఠశాల మరియు అంగన్‌వాడీ సెంటర్ల చిన్నపిల్లల స్కూల్‌లో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.గ్రామ నూతన సర్పంచ్...
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్‌కు ప్రతి భారతీయుడు కృతజ్ఞతలు తెలుపాలి
గార్లపాడు గ్రామ జాతీయ జెండా ఆవిష్కరించిన డిఐజి శ్రీనివాస్ రెడ్డి
"తెలంగాణ ముచ్చట్లు"దినపత్రిక క్యాలెండర్ ఆవిష్కరించిన   రాజోలి గ్రామ సర్పంచ్ చింపుల  గంగిరెడ్డి 
‘నా దేశం – నా బాధ్యత’ నినాదంతో గణతంత్ర వేడుకలు
యువతలో జాతీయ స్పూర్తి నింపిన గణతంత్ర దినోత్సవం
ఎల్కతుర్తి సీఐ కార్యాలయంలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు