రైతు పక్షపాతి కాంగ్రెస్ ప్రభుత్వం

వనపర్తి ఎమ్మెల్యే మేఘా రెడ్డి

రైతు పక్షపాతి కాంగ్రెస్ ప్రభుత్వం

వనపర్తి,జనవరి24(తెలంగాణ ముచ్చట్లు):

కాంగ్రెస్ పార్టీ ఆది నుంచి రైతు పక్షపాతిగానే పనిచేస్తోందని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి  స్పష్టం చేశారు.శనివారం వనపర్తి మండలం రైతు వేదికలో ఏర్పాటు చేసిన రైతులకు రాయితీపై వ్యవసాయ ఉపకరణాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.ఈ సందర్భంగా రూ.77 లక్షల 13 వేల రూపాయల విలువైన రాయితీ వ్యవసాయ ఉపకరణాలను రైతులకు పంపిణీ చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రైతు రుణమాఫీ, రాయితీపై వ్యవసాయ పనిముట్ల పంపిణీ, విత్తనాలు, ఎరువులు, డ్రిప్ పైపులు, స్పింకులర్లు, ట్రాక్టర్లు, కల్టివేటర్లు, రోటవేటర్లు, మందుల పిచికారి యంత్రాలు వంటి అనేక ఉపకరణాలను రాయితీపై అందిస్తున్నామని తెలిపారు. వీటి ద్వారా ఒక్కో రైతుకు సుమారు రూ.20 వేల నుంచి రూ.50 వేల వరకు లబ్ధి చేకూరుతుందన్నారు.గత పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో రైతుల పేరుతో అనేక మోసాలు జరిగాయని, వాటికి నిలువెత్తు సాక్ష్యమే ఈ రోజు నిర్వహించిన రాయితీ వ్యవసాయ ఉపకరణాల పంపిణీ కార్యక్రమమని ఎమ్మెల్యే విమర్శించారు.కేవలం రైతుబంధు పేరుతో ప్రచార ఆర్భాటాలు తప్ప రైతులకు దీర్ఘకాలిక ప్రయోజనం చేకూర్చే వ్యవసాయ ఉపకరణాలపై రాయితీలను అప్పటి ప్రభుత్వం ఎత్తేసిందన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో అన్నదాతల ప్రయోజనార్థం నిర్మించిన ప్రాజెక్టుల ద్వారానే నేటికీ సాగునీరు అందుతోందని, కాలువలకు బొక్కలు పెట్టి మేమే నీళ్లు తెచ్చామని చెప్పడం సిగ్గుచేటని ఆయన వ్యాఖ్యానించారు. గతంలో నిర్మించిన ప్రాజెక్టులకు పూలు చల్లిన నాయకులు రైతుల గురించి మాట్లాడడం హాస్యాస్పదమన్నారు.పదేళ్ల పాలనలో లక్ష రూపాయల రుణమాఫీ చేయని వారు నేడు రుణమాఫీపై మాట్లాడడం విడ్డూరమని తెలిపారు.రైతుల సౌకర్యార్థం వేలాడుతున్న విద్యుత్ తీగలు, స్తంభాలు, నియంత్రికులను సరిచేయడానికి ఇటీవల రూ.50 కోట్ల నిధులు మంజూరు చేయించామని పేర్కొన్నారు.జిల్లాల పునర్వ్యవస్థీకరణకు, రద్దుకు తేడా తెలియని కొందరు నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, పరిపాలన సౌలభ్యం కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లాల పునర్వ్యవస్థీకరణకు చర్యలు చేపట్టిందన్నారు.వనపర్తి వేరుశనగ పంటకు ప్రపంచవ్యాప్త గుర్తింపు ఉందని, ఇందుకు సంబంధించి పెద్దమందడి మండలం వీరాయపల్లి గ్రామంలో వేరుశనగ పరిశోధన కేంద్ర నిర్మాణ పనులను త్వరలోనే వేగవంతం చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు.వేరుశనగ పంటను కాపాడుకునేందుకు రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను రాష్ట్ర ముఖ్యమంత్రివర్యుల దృష్టికి తీసుకెళ్లి 50 శాతం రాయితీతో కంచ నిర్మాణం చేయించేందుకు బాధ్యత తీసుకుంటానన్నారు.ఈ కార్యక్రమంలో వనపర్తి వ్యవసాయ మార్కెట్ యార్డ్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీపీ కిచ్చారెడ్డి, ఖిల్లా ఘణపురం సింగిల్ విండో అధ్యక్షులు మురళీధర్ రెడ్డి, డైరెక్టర్ సాయి చరణ్ రెడ్డి, మార్కెట్ డైరెక్టర్ శారద, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు, వ్యవసాయ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

మణిగిల్ల గ్రామ పాఠశాలలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు మణిగిల్ల గ్రామ పాఠశాలలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
పెద్దమందడి,జనవరి26(తెలంగాణ ముచ్చట్లు): పెద్దమందడి మండలం మణిగిల్ల గ్రామంలోని  పాఠశాల మరియు అంగన్‌వాడీ సెంటర్ల చిన్నపిల్లల స్కూల్‌లో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.గ్రామ నూతన సర్పంచ్...
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్‌కు ప్రతి భారతీయుడు కృతజ్ఞతలు తెలుపాలి
గార్లపాడు గ్రామ జాతీయ జెండా ఆవిష్కరించిన డిఐజి శ్రీనివాస్ రెడ్డి
"తెలంగాణ ముచ్చట్లు"దినపత్రిక క్యాలెండర్ ఆవిష్కరించిన   రాజోలి గ్రామ సర్పంచ్ చింపుల  గంగిరెడ్డి 
‘నా దేశం – నా బాధ్యత’ నినాదంతో గణతంత్ర వేడుకలు
యువతలో జాతీయ స్పూర్తి నింపిన గణతంత్ర దినోత్సవం
ఎల్కతుర్తి సీఐ కార్యాలయంలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు