బలీదుపల్లి గ్రామంలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
అడ్డాకుల,జనవరి26(తెలంగాణ ముచ్చట్లు):
77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని అడ్డాకుల మండలం బలీదుపల్లి గ్రామంలో సోమవారం ఘనంగా వేడుకలు నిర్వహించారు.గ్రామపంచాయతీ కార్యాలయం, అంగన్వాడి కేంద్రం, అంబేద్కర్ విగ్రహం వద్ద, అలాగే ప్రాథమిక పాఠశాల ప్రాంగణంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు.అనంతరం ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన క్రీడా పోటీల్లో పాల్గొని విజేతలుగా నిలిచిన విద్యార్థి–విద్యార్థినులకు గ్రామ సర్పంచ్ కరుణాకర్ రెడ్డి బహుమతులు అందజేశారు.ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులను పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సువర్ణలత సన్మానించారు.అలాగే ప్రాథమిక పాఠశాల స్కూల్ చైర్మన్ మంగరాయి భార్గవిని సైతం సన్మానించడం జరిగింది.గ్రామ ప్రాథమిక పాఠశాలకు అవసరమైన సామాగ్రిని దాతలు మన్యపు రెడ్డి టీవీ, దామోదర్ రెడ్డి డ్రమ్స్, వేణుగోపాల్ రెడ్డి ప్లేట్స్, సర్పంచ్ కరుణాకర్ రెడ్డి క్రీడా బహుమతులు అందజేశారు.విద్యార్థుల కోసం దాతలు ముందుకు వచ్చి పాఠశాల అభివృద్ధికి సహకారం అందించినందుకు ప్రధానోపాధ్యాయురాలు సువర్ణలత కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి కళ్యాణి, ఉప సర్పంచ్ రాధా శివ, మాజీ సర్పంచ్ పద్మ, ఉపాధ్యాయులు భాస్కర్, శోభారాణి, శాంతాబాయి, అంగన్వాడి టీచర్ అరుణమ్మ, గ్రామంలోని తొమ్మిది మంది వార్డు సభ్యులు, గ్రామస్తులు వేణు, దేవరాజ్, అంబేద్కర్ కమిటీ అధ్యక్షులు ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.


Comments