సత్తుపల్లిలో ఘనంగా ‘తెలుగుగళం’ 2026 కేలండర్ ఆవిష్కరణ.
Views: 12
On
సత్తుపల్లి, జనవరి 25 (తెలంగాణ ముచ్చట్లు):
సత్తుపల్లి పట్టణంలో శనివారం తెలుగుగళం జాతీయ తెలుగు దినపత్రిక ముద్రించిన 2026 నూతన సంవత్సర క్యాలెండర్ ను ప్రజాప్రతినిధులు, అధికారులు ఘనంగా ఆవిష్కరించారు.
మొదటిగా సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ కేలండర్‌ను ఆవిష్కరించి, సామాన్యుల గుండెచప్పుడును ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లే వారధిగా తెలుగుగళం పని చేస్తోందని ప్రశంసించారు.
అనంతరం పట్టణ పోలీస్ సీఐ శ్రీహరి, పురపాలక సంఘం కమిషనర్ కె. నరసింహ, తహశీల్దార్ సత్యనారాయణ, సబ్ జైలర్ కుటుంబరాజు, మోటార్ వాహనాల తనిఖీ అధికారి జొన్నలగడ్డ నాగ శ్రీనివాసరావు, న్యాయవాది బోయినపల్లి రవి, మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు కేలండర్‌ను ఆవిష్కరించి తెలుగుగళం సేవలను కొనియాడారు.
ఈ కార్యక్రమంలో పత్రిక ప్రతినిధులు, ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
26 Jan 2026 21:52:07
పెద్దమందడి,జనవరి26(తెలంగాణ ముచ్చట్లు):
పెద్దమందడి మండలం మణిగిల్ల గ్రామంలోని పాఠశాల మరియు అంగన్‌వాడీ సెంటర్ల చిన్నపిల్లల స్కూల్‌లో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.గ్రామ నూతన సర్పంచ్...


Comments