అనారోగ్య బాధితుడికి రూ.2.50 లక్షల ఎల్ఓసి అందజేత
మణిగిల్ల కంటెస్టెడ్ సర్పంచ్ అభ్యర్థి శివ యాదవ్
వనపర్తి,జనవరి24(తెలంగాణ ముచ్చట్లు):
ఖిల్లా ఘణపూర్ మండలం సోలిపూర్ గ్రామానికి చెందిన జనగే చంద్రమౌళి (తండ్రి: జె. నరసింహ) అనారోగ్యంతో బాధపడుతుండగా..ఈ విషయం తెలుసుకున్న కంటెస్టెడ్ సర్పంచ్ మణిగిల్ల శివ యాదవ్ వెంటనే స్పందించారు. బాధితుడిని పరామర్శించి, పరిస్థితిని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు.ఎమ్మెల్యే ఆదేశాల మేరకు చంద్రమౌళిని హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో చేర్పించి, బుచ్చన్న నాయుడు సహకారంతో రూ.2 లక్షల 50 వేల విలువైన ఎల్ఓసిని బాధితుడి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ ఎల్ఓసి ద్వారా బాధితుడికి అవసరమైన వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు.ఈ సందర్భంగా చంద్రమౌళి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. అనారోగ్య సమయంలో తమను ఆదుకున్న ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఈ సహాయానికి చొరవ తీసుకున్న కంటెస్టెడ్ సర్పంచ్ శివ యాదవ్‌కు ధన్యవాదాలు తెలియజేశారు.


Comments