ప్రజల సమస్యలకు ప్రాధాన్యతనిస్తూ వేగవంతంగా పరిష్కారాలు అమలు చేయాలి
నెమలి అనిల్ కుమార్
మల్లాపూర్, జనవరి 24 (తెలంగాణ ముచ్చట్లు):
ప్రజల సమస్యలను ప్రథమ ప్రాధాన్యతగా తీసుకొని వేగవంతంగా పరిష్కారాలు అమలు చేయాలని నెమలి అనిల్ కుమార్ అధికారులను కోరారు. మల్లాపూర్ వార్డు కార్యాలయంలో నాచారం సర్కిల్ నూతన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఈఈ రమేష్, డిప్యూటీ ఇంజనీర్ డీఈ మహేశ్వరిని ఆయన మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.ఈ సందర్భంగా మల్లాపూర్ డివిజన్‌లో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులు, అలాగే నూతన డివిజన్‌కు సంబంధించిన సమస్యలపై విస్తృతంగా చర్చించారు. డివిజన్ పరిధిలోని మౌలిక సదుపాయాల అభివృద్ధికి అధికారులు తక్షణమే చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. ముఖ్యంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పనులు వేగంగా, సమయపాలనతో పూర్తిచేయాల్సిన అవసరాన్ని అధికారుల దృష్టికి తీసుకువచ్చారు.మల్లాపూర్ డివిజన్ అభివృద్ధే లక్ష్యంగా అధికారులు సమన్వయంతో పనిచేయాలని కోరిన నెమలి అనిల్ కుమార్, ప్రజా సమస్యలపై సానుకూలంగా స్పందించిన అధికారులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.ఈ సమావేశంలో సీనియర్ నాయకులు దంతూరి రాజు గౌడ్, బాల్‌రాజ్ గౌడ్, కోయలకొండ రాజేష్, కప్పర సాయి, దాసరి సాయి తదితరులు, కాప్రా డివిజన్ నాయకులు పాల్గొన్నారు.


Comments