రాజకీయాలకు పునాది యూత్ కాంగ్రెస్‌

ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి

రాజకీయాలకు పునాది యూత్ కాంగ్రెస్‌

వనపర్తి,జనవరి24(తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తి పట్టణంలోని ఎంవైఎస్‌ ఫంక్షన్‌ హాల్‌లో శనివారం నిర్వహించిన జిల్లా యూత్ కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పాల్గొని మాట్లాడారు. రాజకీయాలకు యూత్ కాంగ్రెస్ పునాది లాంటిదని, యూత్ కాంగ్రెస్ నుంచి ప్రారంభమైన రాజకీయాలు ఎంతో పటిష్టంగా ఉంటాయని ఆయన పేర్కొన్నారు.జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వాకిటి ఆదిత్య అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని, పార్టీ కోసం రోజుకు కనీసం రెండు గంటలు కేటాయించాలని సూచించారు. సోషల్ మీడియా ప్రచారంలో యూత్ కాంగ్రెస్ ముందుండాలని, భావి భారత ప్రధానిగా రాహుల్ గాంధీ గారిని చేసేంతవరకు నిర్విరామంగా కృషి చేయాలని యువకులకు పిలుపునిచ్చారు.అవినీతిమయమైన బీఆర్‌ఎస్‌ పార్టీ సోషల్ మీడియాలో కాంగ్రెస్ ప్రభుత్వంపై దుష్ప్రచారాలు చేస్తోందని, అలాంటి అసత్య ప్రచారాలను యూత్ కాంగ్రెస్ యువకులు ఎప్పటికప్పుడు ఖండిస్తూ సోషల్ మీడియాలో చురుగ్గా ఉండాలని సూచించారు. యువత అనుకుంటే ఏదైనా సాధించగలదని, వనపర్తి జిల్లా పరిధిలోని ప్రతి యూత్ కాంగ్రెస్ కార్యకర్త పార్టీ బలోపేతం కోసం అంకితభావంతో పనిచేయాలని తెలిపారు.ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో వనపర్తి నియోజకవర్గంలో 40 మందికి పైగా సర్పంచులు యువకులేనని, కాంగ్రెస్ పార్టీ యువతకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో దీనివల్ల స్పష్టమవుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. నియోజకవర్గ పరిధిలో నెలకు కనీసం రెండు యూత్ సమావేశాలు నిర్వహించాలని, ప్రత్యక్ష రాజకీయాలపై ఆసక్తి ఉన్న యువకులకు సర్వేల ఆధారంగా అవకాశాలు కల్పిస్తామని తెలిపారు.గ్రామాల్లో రైతు కూలీలతో మమేకమై అక్కడి సమస్యలను తెలుసుకొని పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. జిల్లాల పునర్విభజనపై అవగాహన లేని కొందరు బీఆర్‌ఎస్‌ నాయకులు జిల్లాల రద్దు అంటూ ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నారని, అలాంటి వారికి తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.ఎన్ని భేదాభిప్రాయాలు ఉన్నా అందరూ కలిసి పనిచేసే పార్టీ కాంగ్రెస్ అని, పార్టీ బలోపేతానికి సమిష్టిగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. విత్ ఐవైసీ యాప్‌ను ఉపయోగించి యూత్ కాంగ్రెస్ చేపట్టే కార్యక్రమాలను నమోదు చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో వనపర్తి వ్యవసాయ మార్కెట్ యార్డ్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు జక్కిడి శివ చరణ్ రెడ్డి, రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఇంచార్జి సయ్యద్ ఖలీద్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీద్, వనపర్తి జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వాకిటి ఆదిత్య, శివాంత్ రెడ్డి, సుకన్య, ఆయా మండలాల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు, యువకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

మణిగిల్ల గ్రామ పాఠశాలలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు మణిగిల్ల గ్రామ పాఠశాలలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
పెద్దమందడి,జనవరి26(తెలంగాణ ముచ్చట్లు): పెద్దమందడి మండలం మణిగిల్ల గ్రామంలోని  పాఠశాల మరియు అంగన్‌వాడీ సెంటర్ల చిన్నపిల్లల స్కూల్‌లో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.గ్రామ నూతన సర్పంచ్...
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్‌కు ప్రతి భారతీయుడు కృతజ్ఞతలు తెలుపాలి
గార్లపాడు గ్రామ జాతీయ జెండా ఆవిష్కరించిన డిఐజి శ్రీనివాస్ రెడ్డి
"తెలంగాణ ముచ్చట్లు"దినపత్రిక క్యాలెండర్ ఆవిష్కరించిన   రాజోలి గ్రామ సర్పంచ్ చింపుల  గంగిరెడ్డి 
‘నా దేశం – నా బాధ్యత’ నినాదంతో గణతంత్ర వేడుకలు
యువతలో జాతీయ స్పూర్తి నింపిన గణతంత్ర దినోత్సవం
ఎల్కతుర్తి సీఐ కార్యాలయంలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు