సిఆర్పి యూనియన్ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక.
Views: 6
On
అశ్వారావుపేట, జనవరి 25 (తెలంగాణ ముచ్చట్లు):
సిఆర్పి యూనియన్ తెలంగాణ రాష్ట్ర కమిటీ నూతన కార్యవర్గాన్ని ఆదివారం హైదరాబాద్‌లోని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యాలయంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సమావేశం 33 జిల్లాల జిల్లా నాయకుల సమక్షంలో నిర్వహించబడింది.
ఈ సందర్భంగా నూతన రాష్ట్ర కార్యవర్గాన్ని ప్రకటించారు. రాష్ట్ర అధ్యక్షునిగా పాడ్య నాగేశ్వరరావు, జనరల్ సెక్రటరీ రవి నాయక్, వర్కింగ్ ప్రెసిడెంట్ రామ్ కుమార్, ఎన్నుకున్నారు.
ఉపాధ్యక్షులుగా కె రవీంద్రనాథ్, బానోత్ సేవ్య నాయక్, రాజశేఖర్, అశోక్, లింగం,రాజేశం, శివరాం, రమేస్ ను నియమించారు. ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా శివరం, రమేష్, శేఖర్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
సిఆర్పి ఉద్యోగుల హక్కుల పరిరక్షణ, సమస్యల పరిష్కారానికి రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత బలోపేతం చేస్తామని నూతన నాయకత్వం ఈ సందర్భంగా వెల్లడించింది.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
26 Jan 2026 21:52:07
పెద్దమందడి,జనవరి26(తెలంగాణ ముచ్చట్లు):
పెద్దమందడి మండలం మణిగిల్ల గ్రామంలోని పాఠశాల మరియు అంగన్‌వాడీ సెంటర్ల చిన్నపిల్లల స్కూల్‌లో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.గ్రామ నూతన సర్పంచ్...


Comments