ఉచిత మెగా హెల్త్ క్యాంప్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి 

ఉచిత మెగా హెల్త్ క్యాంప్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి 

నాచారం, జనవరి 25 (తెలంగాణ ముచ్చట్లు):

ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని నాచారం సర్కిల్ మీర్పేట్ హెచ్‌బీ కాలనీలో అపోలో ఫార్మసీ ఆధ్వర్యంలో లక్ష్మీనగర్ వెల్ఫేర్ అసోసియేషన్ కమ్యూనిటీ హాల్‌లో నిర్వహించిన ఉచిత మెగా హెల్త్ క్యాంప్‌ను ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ జెరిపోతుల ప్రభుదాస్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, ప్రజలకు ఆరోగ్యమే ప్రధానమని పేర్కొంటూ, ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ హెల్త్ క్యాంప్‌లో బీపీ, షుగర్, దంత పరీక్షలు, కంటి పరీక్షలు, లివర్ ఫంక్షన్ టెస్టులు, లంగ్స్ ఫంక్షన్ టెస్టులు, డర్మటాలజీతో పాటు ఫుల్ బాడీ చెకప్‌కు సంబంధించిన అన్ని పరీక్షలను పూర్తిగా ఉచితంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈ వైద్య శిబిరంలో జనరల్ ఫిజీషియన్ డాక్టర్ అమీర, కార్డియాలజిస్ట్ డాక్టర్ సునీల్ మాథ్యూ, డెర్మటాలజిస్ట్ డాక్టర్ దివ్య, ఆర్థోపెడిక్ నిపుణుడు డాక్టర్ సుధాకర్ రెడ్డి, డెంటిస్ట్ డాక్టర్ నిషితతో పాటు వారి వైద్య సిబ్బంది సేవలందించారు.
కార్యక్రమంలో కుషాయిగూడ ఎస్‌ఐ సతీష్, వంజరి ప్రవీణ్ కరిపే, కాలనీ అధ్యక్షుడు రామ్మోహన్ రావు, బాల్ రెడ్డి, సుబ్బారెడ్డి, కోటిరెడ్డి, కామేశ్వర రావు, రామ్ రెడ్డి, ఖాన్, ముత్యారావు, నర్సింగ్ రావు, చక్రవర్తి, వెంకటేశ్వరరావు, మాధవ రావు, సత్యనారాయణ, వెంకట రాముడు తదితర కాలనీ సభ్యులు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. IMG-20260125-WA0024

Tags:

Post Your Comments

Comments

Latest News

మణిగిల్ల గ్రామ పాఠశాలలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు మణిగిల్ల గ్రామ పాఠశాలలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
పెద్దమందడి,జనవరి26(తెలంగాణ ముచ్చట్లు): పెద్దమందడి మండలం మణిగిల్ల గ్రామంలోని  పాఠశాల మరియు అంగన్‌వాడీ సెంటర్ల చిన్నపిల్లల స్కూల్‌లో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.గ్రామ నూతన సర్పంచ్...
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్‌కు ప్రతి భారతీయుడు కృతజ్ఞతలు తెలుపాలి
గార్లపాడు గ్రామ జాతీయ జెండా ఆవిష్కరించిన డిఐజి శ్రీనివాస్ రెడ్డి
"తెలంగాణ ముచ్చట్లు"దినపత్రిక క్యాలెండర్ ఆవిష్కరించిన   రాజోలి గ్రామ సర్పంచ్ చింపుల  గంగిరెడ్డి 
‘నా దేశం – నా బాధ్యత’ నినాదంతో గణతంత్ర వేడుకలు
యువతలో జాతీయ స్పూర్తి నింపిన గణతంత్ర దినోత్సవం
ఎల్కతుర్తి సీఐ కార్యాలయంలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు