మల్లాపూర్ డివిజన్‌లో రూ.3.74 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి

మల్లాపూర్ డివిజన్‌లో రూ.3.74 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

మల్లాపూర్, ఫిబ్రవరి 06 (తెలంగాణ ముచ్చట్లు):

ఉప్పల్ నియోజకవర్గం నాచారం సర్కిల్ మల్లాపూర్ డివిజన్ పరిధిలోని వివిధ కాలనీల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి లక్ష్యంగా మొత్తం రూ.3 కోట్ల 74 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు అభివృద్ధి పనులకు ఉప్పల్ ఎమ్మెల్యే  బండారి లక్ష్మారెడ్డి, మల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా పలుచోట్ల ప్రారంభించిన అభివృద్ధి పనుల వివరాలు ఇలా ఉన్నాయి. శక్తిసాయి నగర్, దత్తాత్రేయ నగర్, గోకుల్ నగర్, సూర్యనగర్ కాలనీల్లో రూ.156 లక్షలతో సీసీ రోడ్డు అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. అలాగే భవాని నగర్, ఎస్వీ నగర్, కెఎల్ రెడ్డి నగర్, అన్నపూర్ణ కాలనీల్లో రూ.140 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణం చేపడతారు. బ్రహ్మపురి కాలనీ, మల్లాపూర్, మల్లికార్జున్ నగర్, బాబానగర్ కాలనీల్లో రూ.78 లక్షలతో సీసీ రోడ్డు అభివృద్ధి పనులు నిర్వహించనున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రతి కాలనీలో అవసరమైన అభివృద్ధి పనులను దశలవారీగా పూర్తి చేస్తామని అన్నారు.కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ, స్థానిక ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి పనులు చేపడుతున్నామని, పనులు నాణ్యతతో సకాలంలో పూర్తయ్యేలా పర్యవేక్షణ చేస్తామని పేర్కొన్నారు.ఈ శంకుస్థాపన కార్యక్రమంలో జిహెచ్ఎంసీ నాచారం సర్కిల్ డీఈ ఉమామహేశ్వరి, ఏఈ సూరజ్, స్పందన, వర్క్ ఇన్‌స్పెక్టర్ భిక్షపతి, రామారావు, స్థానిక నాయకులు, కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.IMG-20260206-WA0087

Tags:

Post Your Comments

Comments

Latest News

బ్యాలెట్ పేపర్స్ స్ట్రాంగ్ రూమ్‌ అర్ముడ్ గార్డు తనిఖీ చేసిన అడిషనల్ డిసిపి బ్యాలెట్ పేపర్స్ స్ట్రాంగ్ రూమ్‌ అర్ముడ్ గార్డు తనిఖీ చేసిన అడిషనల్ డిసిపి
ఖమ్మం బ్యూరో, ఫిబ్రవరి 6(తెలంగాణ ముచ్చట్లు) ఖమ్మం రూరల్ మండలం పెద్ద తండాలోని ప్రియదర్శిని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలోని ఏర్పాటు చేసిన ఏదులాపురం మునిసిపాలిటీ...
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మద్యం దుకాణాలు బంద్ 
మున్సిపల్ ఎన్నికలు: ఫిబ్రవరి 11న స్థానిక సెలవు
నేడు..కొత్తగూడెంలో ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి విస్తృత ప్రచారం
వడ్డెర సంఘం ఖమ్మం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా గోగుల ఆది 
అక్రిడిటేషన్ కార్డుల జారీకి ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానం.. 
సత్తుపల్లి 14వ వార్డులో ప్రజల మనిషిగా కూసంపూడి మహేష్.