మనిగిల్ల గ్రామంలో గ్రామసభ.. అభివృద్ధి పనులపై కీలక చర్చ
అభివృద్ధే లక్ష్యంగా సర్పంచ్ పలుస శ్రీనివాస్ గౌడ్ చర్యలు
పెద్దమందడి,ఫిబ్రవరి5(తెలంగాణ ముచ్చట్లు):
పెద్దమందడి మండలం మనిగిల్ల గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద గ్రామసభ నిర్వహించారు. సర్పంచ్ పలుస శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సభలో గ్రామ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై చర్చ జరిగింది.ఈ సందర్భంగా కొత్తగా నిర్మించనున్న సిసి రోడ్లు, అండర్ డ్రైనేజ్ మోరీలు, మంచినీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణ, కొత్తగా ప్రారంభించనున్న ఉపాధి పనులపై చర్చించారు. ఉపాధి హామీ పథకం ద్వారా అచన్న కాలువలో జమ్ము మరియు సిల్ట్ తొలగింపు పనులు చేపట్టాలని ప్రతిపాదించారు.గ్రామపంచాయతీ సెక్రటరీ వెంకటేష్ మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని తెలిపారు.ఉప సర్పంచ్ గణేష్, వార్డు సభ్యులు తమ సలహాలు, సూచనలు వ్యక్తం చేశారు.అనంతరం సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ గ్రామసభలో పాల్గొన్న అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ పలుస శ్రీనివాస్ గౌడ్, ఉప సర్పంచ్ ముప్పూరి గణేష్ కుమార్, పంచాయతీ సెక్రటరీ వెంకటేష్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, కరెంట్ లైన్ మ్యాన్, అంగన్వాడీ టీచర్లు, ఆశ వర్కర్లు పాల్గొని అభివృద్ధి పనులపై చర్చించారు.


Comments