అలియాబాద్ మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో ఈటల రాజేందర్ రోడ్‌షో

అలియాబాద్ మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో ఈటల రాజేందర్ రోడ్‌షో

మేడ్చల్–మల్కాజిగిరి , ఫిబ్రవరి 06 (తెలంగాణ ముచ్చట్లు)

మేడ్చల్ మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ అలియాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ఘనంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్థానిక బీజేపీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు ఆయనను ఘనంగా స్వాగతించారు.యాడారం గ్రామంలో రోడ్‌షో నిర్వహించిన అనంతరం, ఈటల పాదయాత్ర చేస్తూ ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా మహిళలతో ముచ్చటించి వారి సమస్యలపై సమీక్ష చేశారు. “మా ఇల్లు పక్కనే ఉంది. ఎప్పుడైనా రావచ్చు. ఏ సమస్య వచ్చినా పరిష్కరిస్తాం” అని హామీ ఇచ్చారు.12వ వార్డు బీజేపీ అభ్యర్థి తులసి కృష్ణను కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఆయన ప్రజలను విజ్ఞప్తి చేశారు. “కృష్ణ వెనుక నేనున్నాను… నా వెనుక మోదీ ఉన్నారు. ఏ ఆపద వచ్చినా ఆదుకుంటాం” అన్నారు. ఈటెల రాజేందర్ ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు వ్యక్తం చేశారు. హామీలను అమలు చేయకుండా ప్రజలను అవమానపరిస్తున్నారని, కొత్త పెన్షన్ల కోసం ఉన్న సమస్యలపై చర్యలు లేకపోవడం వల్ల ప్రజలకు కష్టాలు ఎదురవుతున్నాయని ఆరోపించారు.
అంతేకాక, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే బియ్యం, అంగన్‌వాడీ నిధులపై ప్రజలకు గుర్తు చేయిస్తూ, “మనం తినే బియ్యంIMG-20260206-WA0093 మోదీ ఇస్తున్నారు. అంగన్‌వాడీలు కేంద్ర నిధులతోనే నడుస్తున్నాయి. వాళ్ల దగ్గర ఇవ్వడానికి ఏమీ లేదు” అని చెప్పారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .