విశ్వ బ్రాహ్మణ సంఘ భవన నిర్మాణ స్థల పరిశీలన

_నాగారం గ్రామంలోని సర్వే నం.574న స్థలాన్ని పరిశీలించిన అదనపు కలెక్టర్

విశ్వ బ్రాహ్మణ సంఘ భవన నిర్మాణ స్థల పరిశీలన

మేడ్చల్ – మల్కాజ్గిరి , ఫిబ్రవరి 06 (తెలంగాణ ముచ్చట్లు):

మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా కీసర మండలంలోని నాగారం గ్రామంలో విశ్వ బ్రాహ్మణ సంఘ భవన నిర్మాణానికి కేటాయించిన స్థలాన్ని జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి శుక్రవారం పరిశీలించారు.
నాగారం గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 574లో ఉన్న స్థలాన్ని కీసర తహాసీల్దారు యాదగిరి రెడ్డితో కలిసి అదనపు కలెక్టర్ క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. భవన నిర్మాణానికి సంబంధించిన భూమి స్థితిగతులు, హద్దులు, ప్రభుత్వ నిబంధనల అంశాలపై అధికారులతో చర్చించారు.ఈ పరిశీలన కార్యక్రమంలో సర్వేయర్ వినయ్ కుమార్, ఆర్ఐ విశ్వనాథ్ పాల్గొన్నారు. భవన నిర్మాణానికి అవసరమైన తదుపరి చర్యలను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను అదనపు కలెక్టర్ ఆదేశించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .