రెడ్డి కాలనీ అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తా

ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి

రెడ్డి కాలనీ అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తా

చర్లపల్లి, ఫిబ్రవరి 06 (తెలంగాణ ముచ్చట్లు):

ఉప్పల్ నియోజకవర్గం కాప్రా సర్కిల్ చర్లపల్లి డివిజన్ పరిధి లోని రెడ్డి కాలనీ అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తానని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి తెలిపారు.రెడ్డి కాలనీలో జైలు పరిధి నుంచి ఎన్ఓసీ వచ్చేలా ప్రత్యేకంగా చొరవ తీసుకుని, స్టామ్ వాటర్ డ్రెయిన్ నిర్మాణ పనుల కోసం రూ.1 కోటి 26 లక్షల నిధులు మంజూరు చేయించినందుకు కాలనీ వాసులు ఎమ్మెల్యేకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా రెడ్డి కాలనీలో ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలియజేస్తూ స్థానికులు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సమావేశంలో కాలనీకి సంబంధించిన తాగునీరు, డ్రెయినేజీ, రహదారులు తదితర మౌలిక సదుపాయాల సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. సమస్యలపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందిస్తూ, వాటి పరిష్కారానికి తగిన సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.రెడ్డి కాలనీ సమగ్ర అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తూ సహకరిస్తున్న ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డికి కాలనీ వాసులు మరోసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తన దృష్టికి వచ్చిన ప్రతి సమస్య పరిష్కారానికి తప్పకుండా కృషి చేస్తానని ఎమ్మెల్యే ఈ సందర్భంగా స్పష్టం చేశారు.IMG-20260206-WA0082

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .