నితిన్ నబిన్ బహిరంగ సభకు బయలుదేరిన పెద్దమందడి బీజేపీ నాయకులు
పెద్దమందడి,ఫిబ్రవరి4(తెలంగాణ ముచ్చట్లు):
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ విజయ సంకల్ప సభకు పెద్దమందడి మండల బీజేపీ అధ్యక్షుడు ముప్పూరి చెన్నయ్య ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో బయలుదేరారు.నూతనంగా జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన అనంతరం తొలిసారిగా నితిన్ నబిన్ మహబూబ్‌నగర్ జిల్లాకు రావడం సందర్భంగా బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.ఈ సభలో ప్రస్తుతం జరుగుతున్న మున్సిపాలిటీ ఎన్నికలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నట్లు మండల అధ్యక్షుడు ముప్పూరి చెన్నయ్య తెలిపారు.ఎన్నికల్లో విజయం సాధించేలా వ్యూహాలు సూచించడంతో పాటు పార్టీని మరింత బలోపేతం చేయడంపై జాతీయ అధ్యక్షుడు ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు బీజేపీ నాయకులు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు ముప్పూరి చెన్నయ్యతో పాటు మాజీ అధ్యక్షుడు కావలి తిరుపతయ్య, సీనియర్ నాయకులు యాదయ్య, శేఖర్ గౌడ్, చంద్రమౌళి, బాలరాజు తదితర బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


Comments