సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును బాధితుడికి అందజేసిన  పరమేశ్వర్ రెడ్డి

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును బాధితుడికి అందజేసిన  పరమేశ్వర్ రెడ్డి

మల్లాపూర్, ఫిబ్రవరి 04 (తెలంగాణ ముచ్చట్లు):

నెమలి అనిల్ కుమార్ ఆధ్వర్యంలో సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మంజూరైన రూ.2.5 లక్షల ఎల్‌ఓసీ చెక్కును బాధితుడికి పంపిణీ చేశారు. ఉప్పల్ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి సహకారంతో నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జి. రాము (మల్లాపూర్ శ్రీనికేతన్ స్కూల్ కారస్పాండెంట్ నరసింహ బావ)కు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరైన రూ.2,50,000/- ఆర్థిక సహాయాన్ని అందజేశారు.ఈ సందర్భంగా మందుముల పరమేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజలు కష్టాల్లో ఉన్న సమయంలో అండగా నిలవడం తమ బాధ్యత అని తెలిపారు. ముఖ్యంగా అనారోగ్యంతో బాధపడుతున్న కుటుంబాలకు ప్రభుత్వం అందించే సహాయం సకాలంలో అందేలా కృషి చేయడమే తమ లక్ష్యమని అన్నారు. ఈ ఆర్థిక సహాయం రాము చికిత్సకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని పేర్కొంటూ, ఆయన త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ సేవాదళ్ ప్రధాన కార్యదర్శి సద్గుణ్, మల్లాపూర్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి తాండ్ర శ్రీకాంత్ రెడ్డి, నరసింహ, రాజు, సాయి తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .