శ్రీ పశుపతినాథ్ దేవస్థానంలో శని త్రయోదశి ప్రత్యేక పూజలు
Views: 3
On
ఎల్కతుర్తి, జనవరి 31 (తెలంగాణ ముచ్చట్లు):
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలోని వల్లభాపురం గ్రామంలో ఉన్న శ్రీ పశుపతినాథ్ దేవస్థానంలో శని త్రయోదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పంచామృత రుద్రాభిషేకం, అర్చనలు నిర్వహించగా, శ్రీ శనీశ్వర స్వామికి తైలాభిషేకం చేశారు. అనంతరం భక్తులకు తీర్థ, ప్రసాదాలను పంపిణీ చేశారు.
ఈ ప్రత్యేక పూజా కార్యక్రమాలను ఆలయ అర్చకులు, దూప దీప నైవేద్య సంఘం ఎల్కతుర్తి మండల అధ్యక్షులు శ్రీ సదానిరంజన్ సిద్ధాంతి నేతృత్వంలో నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ గంజి భావనఋషి, శ్రవణ్ రావ్, రవీందర్, మహిపాల్, విజయ, మమతతో పాటు గ్రామ ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
31 Jan 2026 22:07:43
--- ప్రతి వెయ్యి మందికి ఒక గ్రామీణ వైద్యుడిని నియమించి గౌరవ వేతనం ఇవ్వాలి--- తెలంగాణ మైనారిటీ గ్రామీణ వైద్యుల సంఘం 12వ మహాసభలో స్పర్శ సామాజిక...


Comments